Taliban: 3వేల లీటర్ల మద్యం కాల్వలో పారబోశారు.. వీడియో

అఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్ల సారథ్యంలోని ప్రభుత్వం మద్యం, డ్రగ్స్‌ వినియోగం, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నారు.......

Published : 04 Jan 2022 01:52 IST

కాబుల్‌: అఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్ల సారథ్యంలని ప్రభుత్వం మద్యం, డ్రగ్స్‌ వినియోగం, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా కాబుల్‌లో మద్యం తయారీ కేంద్రాలపై దాడులు జరిపిన ఆ దేశ ఇంటెలిజెన్స్‌ ఏజెంట్ల బృందం భారీగా మద్యాన్ని సీజ్‌ చేసింది. స్వాధీనం చేసుకున్న దాదాపు 3వేల లీటర్ల మద్యాన్ని కాల్వలో పారబోశారు. దీనికి సంబంధించిన వీడియోను జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఇంటెలిజెన్స్‌ (జీడీఐ) ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ప్రజలు మద్యం తయారీ, పంపిణీకి దూరంగా ఉండాలంటూ ఓ మత గురువు వ్యాఖ్యతో వీడియోను పోస్ట్‌ చేసింది.

అయితే, ఈ దాడులు ఎప్పుడు జరిగాయి? మద్యాన్ని ఎప్పుడు పారబోశారనే విషయాన్ని మాత్రం ప్రకటనలో పేర్కొనలేదు. ఇంటెలిజెన్స్‌ విభాగం ఏజెంట్లు జరిపిన ఈ ఆపరేషన్‌లో ముగ్గురిని అరెస్టు చేసినట్టు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో జీడీఐ తెలిపింది. గతంలో పాశ్చాత్య దేశాల మద్దతుతో కూడిన పాలనలోనూ మద్యం విక్రయాలు, వినియోగంపై నిషేధం ఉండేది.. తాలిబన్లు కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో అధికారులు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. గతేడాది ఆగస్టు 15న అఫ్ఘానిస్థాన్‌ను తమ స్వాధీనంలోకి తెచ్చుకున్న తర్వాత దేశవ్యాప్తంగా మద్యం, డ్రగ్స్‌ స్థావరాలపై తరచూ దాడులు జరుగుతున్నాయి. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని