Abdul Rashid Dostum: అబ్దుల్‌ రషీద్‌ దోస్తుమ్‌ భవనం తాలిబన్ల వశం..!

తాలిబన్లు నేడు కాబుల్‌లోని ఒక కీలక భవనాన్ని స్వాధీనం చేసుకొన్నారు. వార్‌లార్డ్‌ అబ్దుల్‌ రషీద్‌ దోస్తుంకు చెందిన ఒక భారీ భవంతిని స్వాధీనం చేసుకొన్నారు.

Published : 12 Sep 2021 23:45 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తాలిబన్లు నేడు కాబుల్‌లోని ఒక కీలక భవనాన్ని స్వాధీనం చేసుకొన్నారు. వార్‌లార్డ్‌ అబ్దుల్‌ రషీద్‌ దోస్తుంకు చెందిన ఒక భారీ భవంతిని స్వాధీనం చేసుకొన్నారు. ఆయన గతంలో అఫ్గానిస్థాన్‌ ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. ఆయన భవంతిలోకి ఆయుధాలతో ప్రవేశించిన తాలిబన్లు సోఫాల్లో కూర్చొని, భవనమంతా సోదాలు చేసి హడావుడి చేశారు. ఈ భవంతిని స్వాధీనం చేసుకొన్న తాలిబన్లు  ఖారీ సలాహుద్దీన్‌ అయూబీ అనుచరులు. ఆయన తాలిబన్‌ కొత్త ప్రభుత్వంలో ఓ శక్తిమంతమైన కమాండర్‌. ఆయన ఆధీనంలో నాలుగు ప్రావిన్స్‌లు ఉన్నాయి. ఆగస్టు 15వ తేదీనే ఈ భవనాన్ని ఆధీనంలోకి తీసుకొని 150 మందిని  ఉంచి వెళ్లారు. 

తాజాగా అయుబీ  మాట్లాడుతూ  ఆ భవనాన్ని తమ అనుచరులు వాడుకొంటారని పేర్కొన్నారు.  

ఎవరీ దోస్తుం..

అబ్దుల్‌ రషీద్‌ దోస్తుం అఫ్గాన్‌ చరిత్రలోనే ఒక  క్రూరమైన వార్‌లార్డ్‌. గతంలో కమ్యూనిస్టు కమాండర్‌, పారాట్రూపర్‌గా పనిచేశాడు. యుద్ధంలో నలిగిపోతున్న అఫ్గానిస్థాన్లో నలభై ఏళ్లుగా ఆయన అవసరాలను బట్టి పక్షాలను మారుస్తూవచ్చారు. దోస్తుం దళాలు పలు యుద్ధనేరాలు చేశాయి. అవినీతిలో భారీగా సంపాదించినట్లు దోస్తుంకు పేరుంది. తన ప్రభావం తగ్గాక అతను ఉజ్బెకిస్థాన్‌ పారిపోయాడు. ఈ భవనాన్ని స్థానికులు దొంగల అడ్డాగా పిలుస్తారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని