Afghan Crisis: అఫ్గాన్‌ ఆపద్ధర్మ అధ్యక్షుడిని నేనే: అమ్రుల్లా సలేహ్‌ ట్వీట్‌ 

తాలిబన్లు ఆఫ్గానిస్థాన్‌ను కైవసం చేసుకున్న తర్వాత అక్కడ చోటుచేసుకుంటున్న పరిణామాలు భీతికొల్పడంతో పాటు ......

Updated : 17 Aug 2021 21:05 IST

కాబుల్‌: తాలిబన్లు అఫ్గానిస్థాన్‌ను కైవసం చేసుకున్న తర్వాత అక్కడ చోటుచేసుకుంటున్న పరిణామాలు భీతికొల్పడంతో పాటు ఉత్కంఠ రేపుతున్నాయి. అఫ్గాన్‌ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ దేశం విడిచి పారిపోవడంతో ఆపద్ధర్మ అధ్యక్షుడిని తానేనంటూ ఆ దేశ తొలి ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్‌ ప్రకటించుకున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. అఫ్గాన్‌ ఆపద్ధర్మ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించనున్నట్టు వెల్లడించారు. తాను ప్రస్తుతం దేశంలో లోపలే ఉన్నానన్నారు. అఫ్గాన్‌ రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు లేనప్పుడు ఉపాధ్యక్షుడే ఆ బాధ్యతలు నిర్వర్తిస్తారని పేర్కొన్నారు. అందువల్ల ప్రస్తుతం తానే అధ్యక్షుడినని ప్రకటించుకున్నారు. ఏకాభిప్రాయం, మద్దతు కూడగట్టేందుకు నేతలందరినీ కలుస్తానని ఆయన ట్విటర్‌లో వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని