Updated : 08 Sep 2021 18:46 IST

Afghanistan: అఫ్గాన్‌ మహిళలు ఆటలాడొద్దు.. తాలిబన్ల ఆదేశాలు..!

కాబుల్‌: అఫ్గానిస్థాన్‌లో 20ఏళ్ల కిందట తాలిబన్లు అధికారంలో ఉన్నప్పుడు మహిళల పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించారు. వారి హక్కులను కాలరాశారు. ఇప్పుడు మరోసారి వారి పాలన మొదలవడంతో మహిళలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేశారు. తాలిబన్ల రాజ్యం మొదలయ్యాక అక్కడి మహిళల హక్కులు ఒక్కొక్కటిగా హరించుకుపోతున్నాయి. షరియా చట్టాలకు అనుగుణంగానే పాలన సాగిస్తామని చెప్పిన తాలిబన్లు.. అందుకు తగినట్లుగా మహిళలపై అనేక ఆంక్షలు విధిస్తున్నారు. తాజాగా అఫ్గాన్‌ మహిళలు క్రికెట్‌ సహా ఎలాంటి క్రీడల్లో పాల్గొనవద్దని ఆదేశించారు. వారు ఆటలు ఆడేందుకు అనుమతించట్లేదని స్పష్టం చేశారు. అమ్మాయిలకు క్రీడలు అవసరం లేదని, వాటి వల్ల బాడీ ఎక్స్‌పోజింగ్‌ అవుతుందని తాలిబన్‌ కల్చరల్‌ కమిషన్‌ డిప్యూటీ హెడ్‌ అహ్మదుల్లా వాసిఖ్‌ తెలిపారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘మహిళలకు ఆటలు ముఖ్యమని అనుకోవట్లేదు. క్రికెట్‌, ఇంకే ఆటైనా సరే అమ్మాయిలు ఆడాల్సిన అవసరం లేదు. క్రీడల్లో మహిళలకు ఇస్లామిక్‌ డ్రెస్‌ కోడ్‌ ఉండదు. అక్కడ ఆడేవారి ముఖం, శరీరం కవర్‌ చేసుకోలేరు. ఇక ఇప్పుడున్న మీడియా ద్వారా ప్రపంచంలో వారి ఫొటోలు, వీడియోలను ప్రపంచమంతా చూస్తారు. మహిళలు అలా కన్పించడాన్ని ఇస్లామిక్‌ ఎమిరేట్‌(తాలిబన్ల ప్రభుత్వం) అంగీకరించదు. అందువల్ల మహిళలకు క్రీడల్లో పాల్గొనేందుకు అనుమతినివ్వట్లేదు’’ అని వాసిఖ్‌ చెప్పుకొచ్చారు.

అఫ్గానిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు గతేడాదే 25 మంది మహిళా క్రికెటర్లకు కాంట్రాక్ట్‌లు ఇచ్చింది. ఇప్పుడు వారి భవితవ్యంపై ఆందోళన నెలకొంది. మరోవైపు ఇప్పటికే ఆ దేశ మహిళా ఫుట్‌బాల్‌ జాతీయ జట్టు సభ్యులు తమ జెర్సీలను తగలబెట్టినట్లు వార్తలు వచ్చాయి. అటు చదువుకునే అమ్మాయిలపైనా తాలిబన్లు అనేక ఆంక్షలు విధించారు. అమ్మాయిలకు పురుషులు బోధించొద్దని విద్యాసంస్థలను ఆదేశించారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు వెళ్లే మహిళలు తప్పనిసరిగా బుర్ఖా, నికాబ్‌ ధరించాలని, క్లాసుల్లో అమ్మాయిలు, అబ్బాయిల మధ్య పరదా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. అబ్బాయిలు క్యాంపస్‌ నుంచి పూర్తిగా బయటకు వెళ్లిన తర్వాతే అమ్మాయిలను పంపించాలని ఆదేశించారు.


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని