SCO: అఫ్గానిస్థాన్‌పై బయటి నుంచి నియంత్రణ ఉండబోదు

అఫ్గానిస్థాన్‌ విషయంలో పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ తాజాగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంపై బయటినుంచి నియంత్రణ ఉండబోదని పేర్కొన్నారు. తజికిస్థాన్ రాజధాని దుషాంబేలో నిర్వహిస్తున్న షాంఘై కోఆపరేషన్‌...

Published : 17 Sep 2021 20:24 IST

ఎస్‌సీఓ సమావేశంలో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌

ఇస్లామాబాద్‌: అఫ్గానిస్థాన్‌ విషయంలో పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ తాజాగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ దేశంపై బయటి నుంచి నియంత్రణ ఉండబోదని పేర్కొన్నారు. తజికిస్థాన్ రాజధాని దుషాంబేలో నిర్వహిస్తున్న షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీఓ) కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ శిఖరాగ్ర సమావేశంలో శుక్రవారం ఆయన ప్రసంగించారు. తాలిబన్లు.. ప్రజలకు, ప్రపంచ దేశాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సూచించారు. అలాగే అఫ్గాన్‌కు నిరంతర మద్దతు కొనసాగిస్తూనే ఉంటామని చెప్పారు. ‘శాంతియుత, సుస్థిర అఫ్గానిస్థాన్‌ విషయంలో మాకు ఆసక్తి ఉంది. ప్రస్తుతం తాలిబన్ల పాలనలో ఉన్న ఈ దేశంలో తక్షణ మానవతా సహాయం కోసం అంతర్జాతీయ మద్దతును సమీకరించాల్సిన అవసరం ఉంద’ని ఇమ్రాన్‌ తెలిపారు. ఇదే సమావేశాన్ని ఉద్దేశించి నరేంద్ర మోదీ సైతం శుక్రవారం వర్చువల్‌గా మాట్లాడిన విషయం తెలిసిందే. తీవ్రవాదంపై ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ, దీన్ని కట్టడి చేయాలని పిలుపునిచ్చారు. సరిహద్దు సమస్యల పరిష్కారానికి కలిసికట్టుగా పనిచేసేలా చొరవ చూపాలని చైనా, పాకిస్థాన్‌తో సహా మిగిలిన సభ్య దేశాలను కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని