Taliban: ‘సరైన పత్రాలుంటే.. అఫ్గానీయులను బయటకు అనుమతిస్తాం’

సరైన వీసాలు, పాస్‌పోర్టులు కలిగి ఉన్న అఫ్గానీయులకు దేశాన్ని వీడేందుకు అనుమతిస్తామని తాలిబన్ల ప్రతినిధి మౌలావీ హఫీజ్‌ మన్సూర్‌ తెలిపారు. మజారే షరీఫ్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మంగళవారం ఆయన మాట్లాడారు.

Updated : 08 Sep 2021 14:45 IST

కాబుల్‌: సరైన వీసాలు, పాస్‌పోర్టులు కలిగి ఉన్న అఫ్గానీయులకు తమ దేశాన్ని వీడేందుకు అనుమతిస్తామని తాలిబన్ల ప్రతినిధి మౌలావీ హఫీజ్‌ మన్సూర్‌ తెలిపారు. మజారే షరీఫ్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మంగళవారం ఆయన మాట్లాడారు. అమెరికన్లతో పాటు ఇక్కడినుంచి బయల్దేరేందుకు సిద్ధమైన అఫ్గాన్‌వాసులను తాలిబన్లు అడ్డుకున్నారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయమై మన్సూర్‌ మాట్లాడుతూ.. ఎయిర్‌పోర్టులో వేచి ఉన్న చాలామంది అఫ్గాన్‌ పౌరులకు సరైన వీసాలు, పాస్‌పోర్టులు లేవని చెప్పారు. అయితే ఎంతమంది వద్ద లేవోనన్న వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. మరోవైపు, మజారే షరీఫ్‌లో తమ విమానాలను తాలిబన్లు అడ్డుకున్నట్లు వచ్చిన వార్తలను అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ ఖండించారు. ఖతార్‌లో ఆయన మాట్లాడుతూ.. సరైన పత్రాలున్నవారిని సురక్షితంగా పంపిస్తామని తాలిబన్లు హామీ ఇచ్చారని, దాన్ని నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నామన్నారు. అమెరికా ప్రస్తుతం అఫ్గాన్‌లో మిగిలిపోయిన తమ దేశ ప్రజలను, ఇతరులను తరలించాలనే ఒత్తిడిలో ఉంది. ఈ విషయంలో తాలిబన్లతో కలిసి పనిచేస్తామని ఇదివరకే ప్రకటించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని