Delhi: అర్ధరాత్రివేళల్లో ఎక్కడుంటున్నారో లైవ్‌ లొకేషన్లు ఇవ్వండి..!

దిల్లీ(Delhi)లో కారు ప్రమాదంపై ఉన్నతాధికారులు శాఖపరమైన చర్యలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో కీలక అధికారులపై ఆంక్షలు విధించారు.

Updated : 08 Jan 2023 11:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దిల్లీ(Delhi)లో నూతన సంవత్సర సంబరాల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంతో పోలీసులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. అర్ధరాత్రి వేళల్లో పోలీస్‌ సిబ్బంది ఎక్కడ ఉంటున్నారో లైవ్‌ లొకేషన్లు ఉన్నతాధికారులకు షేర్‌ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జనవరి 1 తెల్లవారుజామున అంజలి అనే యువతని కారుతో ఢీకొట్టి దాదాపు రెండు గంటలపాటు ఈడ్చుకెళ్లిన ఘటన తెలిసిందే. ఆ సమయంలో దాదాపు 10 పెట్రోలింగ్‌ వాహనాలు ఉన్నా కారును ఆపలేకపోయాయన్న విషయాన్ని పోలీస్‌ శాఖ సీరియస్‌గా తీసుకొంది. తాజాగా పోలీసు అధికారులకు కొత్త ఆదేశాలు జారీ చేసింది. ‘‘స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌, యాంటీ టెర్రరిస్టు ఆఫీసర్‌, బ్రావో (ఇన్వెస్టిగేషన్ ఇన్‌స్పెక్టర్లు‌)లు అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు వారి లైవ్‌ లొకేషన్లను డీసీపీకి పంపించాలి. వారి పొజిషన్లను అప్‌డేట్‌ చేస్తుండాలి. డీసీపీ అనుమతి లేకుండా ఏ అధికారి పోలీస్‌ స్టేషన్లను వదిలి వెళ్లడానికి వీల్లేదు’’ అని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు.

ఈ కేసులో కొత్తకోణం వెలుగు చూసింది. ప్రత్యక్షసాక్షిగా ఉన్న  అంజలి స్నేహితురాలు నిధి గతంలో డ్రగ్స్‌ కేసులో అరెస్టయినట్లు తెలిసింది. డ్రగ్స్‌ కేసులో నిధి ప్రస్తుతం బెయిలుపై ఉన్నట్లు దిల్లీ(Delhi) పోలీసులు(police) వెల్లడించారు. ప్రమాద సమయంలో స్కూటీపై అంజలితోపాటు ప్రయాణిస్తున్న నిధి.. 2020 డిసెంబరులో తెలంగాణ నుంచి దిల్లీ(Delhi)కి 30 కేజీల గంజాయి రవాణా చేస్తూ ఆగ్రా రైల్వేస్టేషనులో పట్టుబడినట్లు పోలీసులు(police) తెలిపారు. ఘటన జరిగిన రోజు రాత్రి అంజలి మద్యం తాగినట్లు నిధి మీడియాకు తెలిపింది. ఈ విషయాన్ని అంజలి కుటుంబీకులు ఖండించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని