Manish Sisodia: కోర్టు ఊరటనిచ్చినా.. భార్యను చూడలేకపోయిన సిసోదియా..!
ఆప్ నేత మనీశ్ సిసోదియా(Manish Sisodia) అనారోగ్యంతో బాధపడుతోన్న తన సతీమణిని చూడలేకపోయారు. ఆప్ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం..
న్యూదిల్లీ: దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆప్ (AAP) నేత మనీశ్ సిసోదియా(Manish Sisodia) శనివారం జైలు నుంచి ఇంటికి వెళ్లారు. అనారోగ్యంతో ఉన్న భార్యను చూసేందుకు దిల్లీ హైకోర్టు ఆయనకు స్వల్ప ఊరట ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ఇంటికి వెళ్లగా.. తన సతీమణిని మాత్రం కలుసుకోలేకపోయారని సమాచారం. ఆప్ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం..
సిసోదియా సతీమణి సీమా అనారోగ్యానికి గురికావడంతో శనివారం కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. ‘ఆమెను ఎల్‌ఎన్‌జేపీ ఎమర్జెన్సీ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే ఉదయం 9.38 గంటలకు సిసోదియా మథురా రోడ్డులోని ఇంటికి వెళ్లారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆయన్ను ఇంట్లోకి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమెను ఆసుపత్రికి తరలించడంతో ఆయన తన భార్యను చూడలేకపోయారు’ అని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఆటోఇమ్యూన్ డిజార్డర్, మల్టిపుల్ స్క్లెరోసిస్ అనే అరుదైన సమస్యలతో బాధపడుతున్న సీమా ఆరోగ్య పరిస్థితి గతంలోనూ క్షీణించింది. దాంతో గత నెల ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ఆ సమయంలో భార్యను చూసేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని సిసోదియా పిటిషన్ దాఖలు చేశారు. కుమారుడు చదువుల నిమిత్తం విదేశాల్లో ఉన్నాడని, అనారోగ్యంతో ఉన్న భార్యను చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకున్న దిల్లీ హైకోర్టు శుక్రవారం స్వల్ప ఊరట ఇచ్చింది.
శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య సిసోదియా తన ఇంటికెళ్లి భార్య సీమా (Seema)ను చూసిరావొచ్చని న్యాయస్థానం తెలిపింది. అయితే ఇందుకు కొన్ని షరతులు కూడా విధించింది. సిసోదియా తన వెంట ఎలాంటి గ్యాడ్జెట్స్ తీసుకెళ్లొద్దని, మీడియాతో మాట్లాడొద్దని కోర్టు ఆదేశించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Asian Games: భారత్కు మరో రెండు పతకాలు.. ఫైనల్కు కిదాంబి శ్రీకాంత్
-
HCA: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Social Look: సమంత సైకిల్ రైడ్.. దేవకన్యలా ప్రియాంక.. రెడ్ డ్రెస్లో అనన్య
-
ISRO: భూ గురుత్వాకర్షణ పరిధిని దాటేసి..! ‘ఆదిత్య ఎల్1’పై ఇస్రో కీలక అప్డేట్
-
Hyderabad: మర్రిగూడ తహసీల్దార్ అరెస్ట్.. అక్రమాస్తులు రూ.4.75 కోట్లు