Tamil Nadu: కేరళ నుంచి వస్తే కరోనా నెగెటివ్‌ రిపోర్టు తప్పనిసరి..!

రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైరస్‌ కట్టడి చర్యలను తమిళనాడు ప్రభుత్వం ముమ్మరం చేసింది.

Published : 01 Aug 2021 16:26 IST

చెన్నై: రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైరస్‌ కట్టడి చర్యలను తమిళనాడు ప్రభుత్వం ముమ్మరం చేసింది. అందులో భాగంగా.. కేరళ నుంచి రాష్ట్రానికి వచ్చేవారు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్‌ పరీక్ష నెగెటివ్‌ ధ్రువపత్రాన్ని సమర్పించాల్సి ఉంటుందని తెలుపుతూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. గడిచిన నాలుగు రోజుల్లో కేరళలో సుమారు 20 వేల కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగుచూడటంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమై ఆంక్షలు విధించింది. తాజా ఉత్తర్వులు ఈ నెల 5 నుంచి అమల్లో ఉంటాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఎమ్‌ఏ సుబ్రమణియన్‌ వెల్లడించారు. మూడు రోజులుగా రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆర్టీపీసీఆర్‌ పరీక్షల సంఖ్యను కూడా పెంచినట్టు తెలిపారు. ప్రజలు బాధ్యతను మరచి మాస్కులు ధరించకుండా సంచరిస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర సరిహద్దుల్లో తనిఖీలు ముమ్మరం చేసినట్టు పేర్కొన్నారు. అయితే మహారాష్ట్ర, కేరళ నుంచి తమ రాష్ట్రానికి వచ్చేవారికి కర్ణాటక ప్రభుత్వం అంతకుముందు రోజు ఇదే తరహా ఆంక్షలు విధించింది. 

 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని