Aghora: మృతదేహంపై కూర్చుని అఘోరా పూజలు
స్నేహితుడి మృతదేహంపై కూర్చుని ఓ అఘోరా పూజలు చేసిన ఘటన కోయంబత్తూరు జిల్లా సూలూర్ వద్ద ఆదివారం జరిగింది.
తమిళనాడులో ఘటన
చెన్నై (కోయంబత్తూరు), న్యూస్‌టుడే: స్నేహితుడి మృతదేహంపై కూర్చుని ఓ అఘోరా పూజలు చేసిన ఘటన కోయంబత్తూరు జిల్లా సూలూర్ వద్ద ఆదివారం జరిగింది. సూలూర్ సమీపం కురుంబపాళెయానికి చెందిన మణికంఠన్.. అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి రెండేళ్ల క్రితం వివాహమైంది. అభిప్రాయభేదాలతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన మణికంఠన్ ఆదివారం విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తిరుచ్చికి చెందిన అతడి చిన్ననాటి స్నేహితుడు ఒకరికి తెలిసింది. ప్రస్తుతం అఘోరాగా ఉంటున్న ఆ వ్యక్తి సూలూర్‌కి వచ్చి మణికంఠన్ అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. స్నేహితుడి మృతదేహంపై కూర్చుని పూజలు చేశాడు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Elon Musk: ఎక్స్‌లో వీడియో గేమ్ స్ట్రీమింగ్.. కొత్త ఫీచర్‌ను పరిచయం చేసిన మస్క్
-
Assam: బాల్య వివాహాలు.. అస్సాంలో మరోసారి అరెస్టులు
-
Festival Sale: ఐఫోన్, పిక్సెల్, నథింగ్.. ప్రీమియం ఫోన్లపై పండగ ఆఫర్లివే!
-
Nobel Prize: భౌతిక శాస్త్రంలో ఈ ఏడాది ముగ్గురికి నోబెల్
-
Chinna: ‘సిద్ధార్థ్ సినిమానా? ఎవరు చూస్తారు’ అన్నారు.. వేదికపై కన్నీటి పర్యంతమైన నటుడు
-
PM Modi: సహజ వనరుల దోపిడీలో కాంగ్రెస్ రికార్డు: మోదీ ధ్వజం