Updated : 10 Feb 2021 18:00 IST

ఆ రైతులెవరికీ ఎన్‌ఐఏ సమన్లు ఇవ్వలేదు 

రాజ్యసభకు తెలిపిన కిషన్‌ రెడ్డి

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు ఎన్‌ఐఏ సమన్లు జారీ చేయలేదని కేంద్రం స్పష్టంచేసింది. ఆందోళనల్లో పాల్గొన్న కొందరు కర్షకులకు ఎన్‌ఐఏ సమన్లు ఇచ్చిందా? అని కాంగ్రెస్‌ ఎంపీ దిగ్విజయ్‌ సింగ్‌, మరో ఇద్దరు సభ్యులు  అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డి రాజ్యసభలో సమాధానమిచ్చారు. ఆందోళనల్లో పాల్గొన్న రైతులెవరికీ ఎన్‌ఐఏ సమన్లు జారీ చేయలేదన్నారు. ఈ పోరాటంలో పాల్గొన్న రైతులపై  ఎన్‌ఐఏ కేసులు నమోదు చేసిందని, వాటిని ఉపసంహరించుకోవాలని గతంలో రైతు సంఘాల నేతలు కేంద్రాన్ని డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే.

ముఖ్యంగా పంజాబ్‌, హరియాణా, పశ్చిమ యూపీ ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది రైతులు దిల్లీ సరిహద్దుల్లో దాదాపు రెండు నెలలకు పైగా నిరసనలు కొనసాగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు.

ఇదీ చదవండి..

కొన్ని ఖాతాలను రద్దు చేయలేం: ట్విటర్‌

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts