యువతకు అగ్నిపథ్‌ అవకాశాలు ఇలా..!

యువతకు అవకాశాలు కల్పిస్తూనే.. సైన్యంపై ఆర్థిక భారతం తగ్గించేందుకు ప్రభుత్వం నేడు ‘అగ్నిపథ్‌’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద దళాల్లో చేరిన వారికి

Published : 14 Jun 2022 15:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: యువతకు అవకాశాలు కల్పిస్తూనే.. సైన్యంపై ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రభుత్వం నేడు ‘అగ్నిపథ్‌’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద దళాల్లో చేరిన వారికి రాజీలేకుండా అద్భుతమైన శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దనున్నారు.  ఈ క్రమంలోనే పలు సదుపాయాలు కల్పించనున్నట్లు రక్షణశాఖ పేర్కొంది.  మరోమూడు నెలల్లో తొలివిడత నియామకాలు చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన అర్హతలు.. పూర్తి వివరాలు ఇలా..

నియామకాలు ఇలా..

* అగ్నిపథ్‌కు దరఖాస్తు చేసుకొనేందుకు కనీసం వయోపరిమితి పదిహేడున్న సంవత్సరాల నుంచి అత్యధికంగా 21 సంవత్సరాల వరకు అర్హత ఉంటుంది. 

* అభ్యర్థులు నాలుగు సంవత్సరాలు సేవలు అందించేందుకు  వీలుగా ఆయా సర్వీసు చట్టాలకు అనుగుణంగా నియమించుకొంటారు. నియామక ప్రక్రియలో ఎటువంటి మార్పు లేదు. 

* ప్రస్తుతం ఉన్న ట్రైనింగ్‌ సెంటర్లలోనే వీరికి కఠిన శిక్షణ ఉంటుంది.  అనంతరం వీరిని త్రివిధ దళాల్లో నియమిస్తారు. వీరు పర్వతాల నుంచి సముద్రాల వరకు ఎక్కడైన విధులు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలి.

ఆర్థిక లబ్ధి ఇలా..

* వీరికి తొలి సంవత్సరం రూ.4.76లక్షల వార్షిక ఆర్థిక ప్యాకేజీ ఇస్తారు. నాలుగో సంవత్సరంలో రూ.6.92లక్షలు చెల్లిస్తారు. ప్రమాదాలు, ఇతర నష్టాలకు లభించే అలెవెన్స్‌లు కూడా ఉంటాయి. 

* సేవానిధికి ప్రతి ఉద్యోగి 30శాతం జీతం చందాగా చెల్లించాలి. ప్రభుత్వం కూడా దానికి సమాన మొత్తాన్ని ఇస్తుంది. నాలుగు సంవత్సరాల తర్వాత 11.71లక్షలను ఆదాయపు పన్ను మినహాయింపులతో అందజేస్తారు. 

పరిహారాలు ఇలా..

*  నాన్‌కంట్రిబ్యూటరీ జీవిత బీమా కింద రూ.48 లక్షలు చెల్లిస్తారు. ఒక వేళ సర్వీసులో ఉండగా ప్రాణాలు కోల్పోతే..రూ.44 లక్షలు అదనపు నష్టపరిహారం అందజేస్తారు. సేవానిధి మొత్తం నాలుగు సంవత్సరాల కాలానికి చెల్లిస్తారు. 

* ఒక వేళ అవయవాలు దెబ్బతింటే.. వైక్యలం ఆధారంగా అధికారులు పరిహారం నిర్ణయిస్తారు. వీటిల్లో 100శాతానికి రూ.44లక్షలు, 75శాతానికి రూ.25 లక్షలు, 50శాతానికి రూ.15 లక్షలు చెల్లిస్తారు. 

ఇతర అవకాశాలు ఇలా..

* పదవీ కాలం పూర్తయిన వారందరూ సేవానిధి పొందడానికి అర్హులు. సాధించిన నైపుణ్యానికి ధ్రువీకరణ పత్రంతోపాటు.. ఉన్నత విద్యకు అవకాశం కల్పిస్తారు. 

* ప్రతిభ, సర్వీసులో పనితీరు ఆధారంగా పారదర్శకంగా స్క్రీనింగ్‌ నిర్వహిస్తారు. 100శాతం ‘అగ్నివీర్‌’లు రెగ్యూలర్‌ కేడర్‌లో చేరడానికి స్వచ్ఛందంగా దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు కఠినమైన  ఎంపిక ప్రక్రియను దాటుకొని రెగ్యూలర్‌ కేడర్‌లో నమోదు చేసుకొంటే.. సాధారణ సైనికుడి వలే వేతనం చెల్లిస్తారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం పింఛను లభిస్తుంది. 

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు