The Kashmir Files: ఫరూఖ్‌ అబ్దుల్లా విమర్శలు.. ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ డైరెక్టర్‌ ఘాటు రిప్లయ్‌

‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రంపై జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్‌ అబ్దుల్లా చేసిన విమర్శలకు ఆ సినిమా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి

Published : 18 May 2022 01:52 IST

ముంబయి: ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రంపై జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్‌ అబ్దుల్లా చేసిన విమర్శలకు ఆ సినిమా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి స్పందించారు. ఈ సినిమా వల్లే కశ్మీర్‌ లోయలో అమాయక ప్రజలు కనీసం మాట్లాడటం నేర్చుకున్నారంటూ వివేక్‌ గట్టి కౌంటర్‌ ఇచ్చారు.

ఇటీవల రాహుల్‌ భట్‌ అనే ఓ ప్రభుత్వ ఉద్యోగిని బుద్గాంలో ఉగ్రవాదులు కాల్చి చంపారు. దీంతో కశ్మీర్‌ లోయలో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. ఈ ఘటనల నేపథ్యంలో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ అధినేత ఫరూఖ్‌ అబ్దుల్లా నిన్న మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రం తప్పుదోవ పట్టించేలా ఉంది. దీని గురించి నేను లెఫ్టినెంట్‌ గవర్నర్‌తో మాట్లాడాను. దేశంలో విద్వేషాలను వ్యాప్తి చేసే అలాంటి సినిమాలను, మీడియాను ఆపాలి’’ అని చెప్పుకొచ్చారు.

ఇందుకు సంబంధించిన వీడియోను వివేక్‌ అగ్నిహోత్రి తన ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘‘సరిగ్గా చెప్పారు ఫరూఖ్‌ సాహెబ్‌. ది కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమానే లేకపోతే హిందువులపై హింసాకాండ జరిగేదే కాదు. మా సినిమా నుంచే అక్కడి ప్రజలు ‘రలివ్‌, గలివ్‌, చలివ్‌(మారు, వెళ్లిపో లేదా చచ్చిపో) అనే పదాలను నేర్చుకున్నారు. లేదంటే అమాయక ప్రజలు కనీసం ఎలా మాట్లాడాలో కూడా తెలిసేది కాదు. మా సినిమా వల్లే పాక్‌ జెండాను కూడా ఎగురవేశారు కదా’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని