Updated : 27 Jun 2022 11:50 IST

Agnipath: అగ్నిపథ్‌కు దరఖాస్తుల వెల్లువ.. మూడు రోజుల్లోనే ఎన్ని వచ్చాయంటే..?

దిల్లీ: త్రివిధ దళాల్లో చేరాలనుకునేవారికి కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన ‘అగ్నిపథ్‌’ పథకం కింద వాయుసేనలో(IAF​) నియామకాల ప్రక్రియ ప్రారంభం కాగా అభ్యర్థుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. మూడు రోజుల వ్యవధిలోనే 56,960 దరఖాస్తులు వచ్చినట్లు వాయుసేన వెల్లడించింది. ఓ వైపు అగ్నిపథ్​కు వ్యతిరేకంగా దేశంలో పలు రాష్ట్రాల్లో ఆందోళనలు జరుగుతున్న సమయంలో మూడు రోజుల్లోనే భారీగా దరఖాస్తులు రావడం గమనార్హం. అగ్నిపథ్ (Agnipath) కింద వాయుసేన దరఖాస్తు ప్రక్రియను శుక్రవారం ప్రారంభించిన విషయం తెలిసిందే​. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జులై 5వ తేదీన ముగుస్తుందని ఐఏఎఫ్‌ అధికారులు వెల్లడించారు. ఆసక్తి గల అభ్యర్థులు agnipathvayu.cdac.in వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. అగ్నివీర్‌ తొలి బ్యాచ్​ను 2022 డిసెంబర్‌ 11 నాటికి ప్రకటించనున్నారు.

‘అగ్నిపథ్’ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం జూన్​ 14న ప్రకటించింది. పదిహేడున్నర సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల గల యువకులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. నాలుగేళ్ల పూర్తయ్యాక వారి 25 శాతం మందిని మరో 15 ఏళ్లపాటు కొనసాగిస్తారని పేర్కొంది. అయితే ఈ పథకంపై దేశవ్యాప్తంగా యువత నిరసనలు  వ్యక్తం కావడంతో పాటు గత రెండేళ్లుగా నియామకాలు చేపట్టకపోవడంతో 2022 రిక్రూట్​మెంట్​లో గరిష్ఠ వయోపరిమితిని కేంద్రం 23 ఏళ్లకు పెంచింది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని