UP Elections 2022: 94వ సారి ఎన్నికల బరిలోకి.. 100 సార్లు ఓడిపోవడమే లక్ష్యం

ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణాలను వేగంగా మారుతున్నాయి. అధికారంలో ఉన్న భాజపా నుంచి కొంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు.. ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీలో

Updated : 21 Jan 2022 06:32 IST

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణాలను వేగంగా మారుతున్నాయి. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం అయిన యూపీలో ఈ సారి ఓ వ్యక్తి 94వ సారి ఎన్నికల్లో పోటీ చేయబోతుండటం విశేషం. ఇప్పటివరకు 93సార్లు పోటీ చేసిన ఆయన.. వాటన్నింటిలోనూ ఓటమి పాలుకావడం గమనార్హం. ఆగ్రా జిల్లాలోని ఖేరాగడ్‌ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయాలని 74 ఏళ్ల హసనురామ్ అంబేద్కర్‌ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. 

డా.బి.ఆర్‌.అంబేద్కర్‌ సిద్ధాంతంతో అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు హసనురామ్ పేర్కొన్నారు. ఇతడు వ్యవసాయ కూలీ. హసనురామ్‌ 1985 నుంచి స్థానిక సంస్థలు, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా వివిధ నియోజకవర్గాల్లో పోటీచేస్తూ వస్తున్నారు. 1988లో రాష్ట్రపతి అభ్యర్థిగానూ నామినేషన్‌ దాఖలు చేశారు. కానీ, అది తిరస్కరణకు గురైంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆగ్రా, ఫతేపూర్‌ సిక్రీ నుంచి పోటీ చేశారు. 1989 లోక్‌సభ ఎన్నికల్లో ఫిరోజాబాద్‌ నుంచి పోటీచేశారు. ఈయన పోటీచేసిన ఎన్నికల్లో అత్యధికంగా ఓట్లు (36,000) వచ్చింది ఇక్కడే. ఇతడు అధికారికంగా విద్య అభ్యసించినట్లు ఆధారాలు లేవు. కానీ, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్‌ చదవడం, రాయడం విశేషం.

‘నిష్పక్షపాత, అవినీతి రహిత అభివృద్ధి, సమాజంలో అట్టడుగు వర్గాల సంక్షేమమే నా ఎజెండా. బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం స్థాపించిన అఖిల భారత వెనుకబడిన, మైనార్టీ వర్గాల ఉద్యోగుల సమాఖ్య (బామ్‌సెఫ్)లో అంకితభావంతో గల కార్యకర్తని. బీఎస్పీలో కూడా పనిచేశా. 1985లో టికెట్‌ అడిగితే నీ భార్య కూడా నీకు ఓటు వేయదు.. అని హేళన చేశారు. దీంతో తీవ్ర నిరుత్సాహానికి  గురయ్యా. అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లోనూ ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీచేస్తున్నా. నేను ఓడిపోవడానికే ఎన్నికల్లో పోటీ చేస్తాను. గెలిచి తర్వాత నాయకులు ప్రజలను మరిచిపోతారు. ఎన్నికల్లో 100 సార్లు ఓడిపోయి రికార్డు నెలకొల్పడమే నా లక్ష్యం. అంబేద్కర్‌ సిద్ధాంతాలను విశ్వసించే ఓటర్లకు ఆప్షన్‌ ఇచ్చేందుకు ఎన్నికల్లో పోటీ చేస్తాను. కాబట్టి నా ప్రత్యర్థులు ఎవరనేది పట్టించుకోను’ అని హసనురామ్‌ వివరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని