Air India: వారి చేతుల్లో ఎయిరిండియా వికసిస్తుంది.. కేంద్ర మంత్రి విశ్వాసం

ఎయిరిండియా యాజమాన్య హక్కులు గురువారం అధికారికంగా టాటా గ్రూప్‌నకు బదిలీ అయిన విషయం తెలిసిందే. దీనిపై పౌరవిమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందించారు. ‘ఈ ప్రక్రియను నిర్ణీత వ్యవధిలోపు...

Published : 27 Jan 2022 20:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎయిరిండియా యాజమాన్య హక్కులు గురువారం అధికారికంగా టాటా గ్రూప్‌నకు బదిలీ అయిన విషయం తెలిసిందే. దీనిపై పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందించారు. ‘ఈ ప్రక్రియను నిర్ణీత వ్యవధిలోపు విజయవంతంగా పూర్తి చేయడం గమనించదగ్గ విషయం. ఇది ప్రభుత్వ సామర్థ్యాన్ని, భవిష్యత్తులో ఇతర రంగాల్లో పెట్టుబడుల ఉపసంహరణను సమర్థంగా నిర్వహించాలనే సంకల్పాన్ని రుజువు చేస్తుంది’ అని ట్వీట్‌ చేశారు. ఎయిరిండియా కొత్త యజమానులకు శుభాకాంక్షలు తెలుపుతూ.. వారి చేతుల్లో ఈ ఎయిర్‌లైన్స్ వికసించడంతోపాటు భారత్‌లో అభివృద్ధి చెందుతున్న పౌర విమానయాన పరిశ్రమకు మార్గం సుగమం చేస్తుందని విశ్వసిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన టాటా సన్స్‌ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌ సైతం.. ఎయిరిండియా అప్పగింత ప్రక్రియ పూర్తయినందుకు హర్షం వ్యక్తం చేశారు. ప్రయాణికులకు ప్రపంచస్థాయి సేవలు అందించేందుకు టాటా గ్రూప్‌ కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. 1932లో టాటా గ్రూప్‌ టాటా ఎయిర్‌లైన్స్‌ను ప్రారంభించగా.. 1946లో దాన్ని ఎయిరిండియా పేరు మార్చారు. 1953లో ఎయిరిండియాను ప్రభుత్వం స్వాధీనం చేసుకోగా.. మళ్లీ 69 ఏళ్ల తర్వాత ప్రస్తుతం అదే గ్రూప్‌నకు చేరింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని