Air India: ఎయిరిండియా ప్రయాణికుల అవస్థలు.. రష్యాకు బయలుదేరిన ప్రత్యేక విమానం
ఇంజిన్ సమస్య తలెత్తడంతో రష్యాలో దిగిన ఎయిరిండియా(Air India) విమాన ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రభుత్వం సత్వరం చర్యలు చేపట్టింది. దానిలో భాగంగా మరో ఎయిరిండియా విమానాన్ని రష్యాకు పంపింది.
దిల్లీ: దిల్లీ నుంచి అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకు బయలుదేరిన ఎయిరిండియా విమానం ఇంజిన్‌లో సమస్య తలెత్తడంతో రష్యాలో దిగిన విషయం తెలిసిందే. అయితే, అందులోని 216 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్న ఎయిరిండియా.. అందుకు అనుగుణంగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. దానిలో భాగంగా ముంబయి నుంచి ఎయిరిండియా ప్రత్యేక విమానం బయలుదేరిందని, అది గురువారం ఉదయం రష్యాకు చేరుకుంటుందని తెలిపింది.
‘బుధవారం మధ్యాహ్నం ఎయిరిండియా AI195 ప్రత్యేక విమానం ముంబయి నుంచి మాగదన్‌కు బయలుదేరింది. అందులో ప్రత్యేక బృందాన్ని పంపించాం. ఆ బృందం రష్యాలో చిక్కుకుపోయిన ప్రయాణికులు, సిబ్బందికి సహాయం చేస్తుంది. అలాగే ప్రయాణికులకు సరిపడా ఆహారాన్ని పంపించాం. ఈ విమానం జూన్ 8న శాన్‌ఫ్రాన్సిస్కోకు బయలుదేరుతుంది’ అని ఎయిరిండియా తాజా ప్రకటనలో వెల్లడించింది. దిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు బయలుదేరిన ఎయిరిండియా విమానం AI173 ఓ ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు పైలట్లు గుర్తించారు. అనంతరం దాన్ని వెంటనే విమానాన్ని రష్యా వైపు మళ్లించారు. అది రష్యాలోని మాగదన్ విమానాశ్రయంలో సురక్షితంగా దిగింది.
విమానంలో చోటుచేసుకున్న సాంకేతిక సమస్యలను పరిశీలిస్తున్నామని అటు రష్యా విమానయాన సంస్థ కూడా వెల్లడించింది. ఇదే సమయంలో ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు తీసుకెళ్లేందుకు వీలుగా మరో విమానం ల్యాండ్ అయ్యేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలిపింది. రష్యాలో ఎయిరిండియా దిగడాన్ని తాము గమనిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. విమానంలో అమెరికా పౌరులు ఉండే అవకాశం ఉందని తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Rajinikanth: ‘తలైవా 170’ గురించి ఆసక్తికర విషయం పంచుకున్న రజనీకాంత్..
-
MS Dhoni: ప్రపంచ కప్‌లో మాహీ... ఎందుకంత స్పెషల్ అంటే!
-
US Speaker: అమెరికా చరిత్రలో తొలిసారి.. స్పీకర్‌కు ఉద్వాసన
-
Delhi Liquor Scam: ఆప్ నేత సంజయ్ సింగ్ ఇంట్లో ఈడీ సోదాలు
-
Asian Games: ఆర్చరీలో స్వర్ణం.. ఆసియా క్రీడల్లో భారత్ ‘పతకాల’ రికార్డ్
-
Stock Market: కొనసాగుతున్న నష్టాల పరంపర.. 19,400 దిగువకు నిఫ్టీ