New Chief of Air Staff: భారత వాయుసేన కొత్త చీఫ్‌గా వీఆర్‌ చౌధరి!

భారత వాయుసేన కొత్త దళపతిగా ఎయిర్‌ మార్షల్‌ వీఆర్‌ చౌధరిని నియమించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం వైమానిక ....

Updated : 21 Sep 2021 20:48 IST

దిల్లీ: భారత వాయుసేన కొత్త దళపతిగా ఎయిర్‌ మార్షల్‌ వీఆర్‌ చౌధరిని నియమించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం వైమానిక దళ ఉపాధ్యక్షుడిగా ఉన్న ఆయన్ను తదుపరి చీఫ్‌గా నియమించనున్నట్లు రక్షణశాఖ ప్రకటించింది. ప్రస్తుతం వైమానిక దళాధిపతిగా కొనసాగుతున్న ఆర్‌కేఎస్‌ భదౌరియా ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో కొత్త చీఫ్‌గా చౌధరిని నియమిస్తున్నట్టు రక్షణశాఖ పేర్కొంది. ఎయిర్‌ మార్షల్‌ చౌధరి 1982 డిసెంబర్‌ 29న భారత వాయుసేనలోకి ప్రవేశించారు. పలు రకాల ఫైటర్‌ జెట్‌లతో పాటు ట్రైనర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లలో 3800 గంటలకుపైగా ప్రయాణించిన అనుభవం ఆయనకు ఉందని భారత వాయుసేన ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆయన నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ, వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్‌ సర్వీస్‌ స్టాఫ్‌ కళాశాల పూర్వవిద్యార్థి కూడా. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని