
Updated : 15 Apr 2021 10:07 IST
విమానయానంపై బెంగాల్ కొత్త మార్గదర్శకాలు
కోల్‌కతా: దేశంలో కొవిడ్ ఉద్ధృతి ధాటికి పశ్చిమ్‌బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ విమాన ప్రయాణాలపై బుధవారం నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులు విధిగా ఆర్టీ-పీసీఆర్ టెస్టు చేయించుకోవాలని సూచించింది. బోర్డింగ్‌కు 72 గంటలకు ముందుగా ఈ టెస్టు చేయించుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ధ్రువీకరణ పత్రం(నెగిటివ్ రిపోర్టు) చూపిస్తేనే విమాన ప్రయాణానికి అనుమతిస్తామని పేర్కొంది. అలాగే బెంగాల్ నుంచి వెళ్లే ప్రయాణికులకూ ఇదే నియమం వర్తిస్తుందని వివరించింది.
ఇవీ చదవండి
Tags :