Domestic flights: 85శాతం సీటింగ్ సామర్థ్యంతో విమానాలకు అనుమతి

షెడ్యూల్డ్ దేశీయ విమానాలు 85 శాతం సీటింగ్ సామర్థ్యంతో నడుపుకోవచ్చని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది....

Published : 19 Sep 2021 23:37 IST

దిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి తగ్గుతున్న నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్డ్ దేశీయ విమానాలు 85 శాతం సీటింగ్ సామర్థ్యంతో నడుపుకోవచ్చని తెలిపింది. ప్రయాణికుల డిమాండ్ మేరకు ప్రస్తుత పరిస్థితిని సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం మొత్తం సీటింగ్ సామర్థ్యంలో 72.5 శాతంతోనే విమానాలు నడుస్తున్నాయి. 

గతేడాది లాక్‌డౌన్ సమయంలో దేశీయ విమానాలపై పూర్తి నిషేధం విధించారు. లాక్‌డౌన్ అనంతరం 2020 మే 25న కొవిడ్ నిబంధనల మేరకు 33 శాతం సీటింగ్  కెపాసిటీతో విమానాలు నడిపేందుకు అనుమతి లభించింది. డిసెంబర్ వరకు క్రమంగా 80 శాతానికి పెంచగా.. సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ ఏడాది జూన్ 1న ఆక్యుపెన్సీని 50 శాతానికి తగ్గించారు. అనంతరం ఆగస్టు 12 నాటికి ఆక్యుపెన్సీని 72.5 శాతానికి పెంచారు. తాజాగా 85 శాతం సీటింగ్ సామర్థ్యంతో విమానాలను నడుపుకొనేందుకు విమానయాన సంస్థలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని