Updated : 23 Aug 2021 22:02 IST

Afghan Crisis: తాలిబన్ల నుంచి మీకెలాంటి ముప్పు ఉండదు

కాబుల్‌లోని సిక్కులు, హిందువులకు అకాలీ నేత మంజీదర్‌సింగ్‌ సిర్సా హామీ

దిల్లీ: తాలిబన్ల రాకతో అఫ్గనిస్థాన్‌లో ఎటు చూసినా తీవ్ర ఉద్రికత్త వాతావరణం నెలకొనింది. తామేమి చేయమని తాలిబన్లు మొదట్లో ఇచ్చిన హామీలన్నీ బూటకమని తేలడంతో.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుంటున్నారు అక్కడి ప్రజలు. ఎలాగైనా అక్కడి నుంచి బయటపడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాబుల్‌లోని గురుద్వారాలో చిక్కుకుపోయిన సిక్కులు, హిందువుల భద్రతకు ఎవరూ ఆందోళన చెందవద్దని దిల్లీ సిఖ్‌ గురుద్వారా మేనేజిమెంట్‌ కమిటీ ప్రెసిడెంట్‌ మంజీదర్‌సింగ్‌ సిర్సా తెలిపారు. ఈమేరకు తాలిబన్ల అధికార ప్రతినిధి, ఇస్లామిక్‌ ఎమిరేట్స్‌ అఫ్గనిస్థాన్‌ ప్రతినిధి బుధవారం విడుదల చేసిన వీడియోను ట్విటర్‌లో పంచుకున్నారు. 76 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో గురుద్వారాలో పలువురు సిక్కులు, హిందువులు మాట్లాడుతున్న దృశ్యాలతో పాటు స్థానిక గురుద్వారా కమిటీ ప్రెసిడెంట్ జారీ చేసినచ ప్రకటన కూడా ఉంది. కాబుల్‌లోని గురుద్వారా కమిటి ప్రెసిడెంట్‌ కాబుల్‌ ఎస్‌. గుర్నామ్‌ సింగ్‌, సంగాత్‌తో నిత్యం టచ్‌లో ఉన్నానని.. అక్కడి హిందువులు, సిక్కులకు తాలిబన్లు భద్రతకు భరోసా ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఇదే వీడియోను తాలిబాన్‌ ప్రతినిధి అరబిక్‌ భాషలో ట్వీట్‌ చేశారు.‘‘సిక్కులు, భారతీయుల జీవితాలకు ఎలాంటి ముప్పు లేదు. గతంలో భయాందోళనకు గురైనప్పటికీ.. ఇప్పుడు వారి జీవితాలు, ఉపాధి గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. తాలిబన్ల నుంచి ఎలాంటి సమస్యలు రావని భరోసా కల్పిస్తున్నాం’’ అంటూ ట్వీట్‌ చేశారు. కాగా సోమవారం పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరేందర్‌ సింగ్‌ కాబుల్‌లోని గురుద్వారాలో చిక్కుకుపోయిన సుమారు 200 మంది సిక్కులను కాపాడాలంటూ విజ్ఞప్తి చేశారు. వారిని కాపాడేందుకు పంజాబ్‌ ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని తెలిపారు.



Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని