
Assam: అఖిల్ గొగొయ్ విడుదల
గువాహటి: అసోంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో జైలు నుంచే ఎమ్మెల్యేగా గెలుపొందిన సమాచార హక్కు చట్టం కార్యకర్త, రైజోర్ దళ్ పార్టీ అధ్యక్షుడు అఖిల్ గొగొయ్ ఎట్టకేలకు విడుదలయ్యారు. 2019 డిసెంబర్లో సీఏఏ వ్యతిరేక ఆందోళనల్లో భాగంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న అభియోగాలపై నమోదైన రెండు కేసుల్లో అఖిల్ గొగొయ్ అరెస్టయ్యారు. ఆ రెండు కేసుల్లోనూ అతడిపై అభియోగాలను ఎన్ఐఏ కోర్టు తోసిపుచ్చడంతో దాదాపు ఏడాదిన్నర కాలం తర్వాత జైలు జీవితం నుంచి బయటపడ్డారు.
విడుదల అనంతరం అఖిల్ గొగొయ్ మీడియాతో మాట్లాడుతూ ఎట్టకేలకు సత్యం గెలిచిందని చెప్పారు. తనను జైల్లో ఉంచాలన్న ప్రయత్నాలు బెడిసికొట్టాయన్నారు. రేపు తన నియోజకవర్గం శివసాగర్‌లో పర్యటించి ప్రజలకు ధన్యవాదాలు చెబుతానని చెప్పారు. తనను జైల్లో ఉంచడానికి ప్రయోగించిన ఉపా చట్టంపై ఇకపై తన పోరు కొనసాగుతుందని అఖిల్ పేర్కొన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.