Updated : 04 Oct 2021 12:54 IST

Lakhimpur Kheri Violence: రైతులపై ఇన్ని దారుణాలు బ్రిటిషర్లూ పాల్పడలేదు

ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ ఆరోపణలు.. అదుపులోకి తీసుకున్న పోలీసులు

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌ లఖీంపుర్‌ ఖేరీ ఘటనలో బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న నేతలను యూపీ పోలీసులు కట్టడి చేస్తున్నారు. ఈ క్రమంలో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌నూ సోమవారం లఖ్‌నవూలోని ఆయన ఇంటి వద్ద అడ్డుకున్నారు. దీంతో ఆయన ఇంటి బయటే నిరసనకు దిగారు. లఖీంపుర్‌ ఖేరీకి వెళ్తున్న నేతలను ప్రభుత్వం అడ్డుకుంటోంది.. అసలు ఇంతకు ఏం దాస్తోందని ప్రశ్నించారు. ‘భాజపా ప్రభుత్వం రైతులపై పాల్పడుతున్నన్ని దారుణాలు బ్రిటిష్ వారూ పాల్పడలేదు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ప్రసాద్‌ మౌర్య వెంటనే రాజీనామా చేయాలి. ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు రూ.2 కోట్ల చొప్పున పరిహారం ప్రకటించాలి. బాధిత కుటుంబాల్లోని వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి’ అని అఖిలేశ్‌ డిమాండ్‌ చేశారు. అనంతరం ఉద్రిక్తతల నడుమ పోలీసులు ఆయన్ను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు ఆయన ఇంటి వద్ద భారీ ఎత్తున బలగాలను మొహరించారు. మరోవైపు ఆయన ఇంటి సమీపంలో ఓ పోలీసు వాహనానికి కొందరు నిప్పంటించారు.

‘అన్నదాతలను గెలిపించేలా చేస్తాం’

కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రాను సైతం పోలీసులు ఈ ఉదయం అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె.. పోలీసులను నిలదీశారు. దీనిపై రాహుల్‌ గాంధీ స్పందిస్తూ.. ‘ప్రియాంకా.. నాకు తెలుసు.. నువ్వు వెనకడుగేయవని. నీ ధైర్యానికి వారు భయపడిపోయారు. న్యాయం కోసం జరుగుతున్న ఈ అహింసా పోరాటంలో.. మేము అన్నదాతలను గెలిపించేలా చేస్తాం’ అని ట్వీట్‌ చేశారు. మరోవైపు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్, పంజాబ్ ఉప ముఖ్యమంత్రి ఎస్ఎస్ రాంధవా లఖ్‌నవూ విమానాశ్రయంలో దిగేందుకు యూపీ ప్రభుత్వం అనుమతించలేదని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని