TMC: తృణమూల్ కాంగ్రెస్‌ ట్విటర్ ఖాతా హ్యాక్‌..!

తమ పార్టీ అధికారిక ట్విటర్ ఖాతా హ్యాకింగ్‌కు గురైనట్లు తృణమూల్ కాంగ్రెస్(Trinamool Congress) వెల్లడించింది. దీనిపై ట్విటర్‌కు సమాచారం ఇచ్చినట్లు చెప్పింది. 

Published : 28 Feb 2023 10:13 IST

కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్‌(Trinamool Congress) ట్విటర్‌(Twitter) ఖాతా హ్యాక్‌ అయింది. ఆ పార్టీకి చెందిన ప్రొఫైల్ నేమ్, ఫొటో మారిపోయాయి. ప్రొఫైల్‌ నేమ్‌ యుగ ల్యాబ్స్‌(Yuga Labs)గా మారగా, ప్రొఫైల్‌ ఫొటో వై ఆకారంలో కనిపిస్తోంది. 

యుగల్యాబ్స్‌ అనేది క్రిప్టో సంస్థ పేరుగా తెలుస్తోంది. హ్యాకింగ్ తర్వాత కొత్తగా ఒక్క ట్వీట్ కూడా పోస్టు కాలేదు. అయితే నాన్‌ ఫంగిబుల్ టోకెన్స్‌(NFT)కు సంబంధించిన ట్వీట్లకు మాత్రం ఈ ఖాతా నుంచి సమాధానాలు వెళ్లాయి. ఈ హ్యాకింగ్ గురించి తాము ట్విటర్‌ సంస్థకు ఫిర్యాదు చేసినట్లు తృణమూల్(TMC) పార్టీ వెల్లడించింది. ‘మా పార్టీ ట్విటర్ ఖాతా హ్యాక్‌ అయింది. దీనిపై మేం ఆ సంస్థ ప్రతినిధులను సంప్రదించాం. దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని వారు వెల్లడించారు’ అని ఆ పార్టీ నేత డెరెక్‌ ఓబ్రీన్‌ వెల్లడించారు.

గతంలో అమెరికాకు చెందిన పలువురు ప్రముఖల ట్విటర్(Twitter) ఖాతాలు హ్యాక్‌ అయ్యాయి. ఈ మాస్‌ హ్యాకింగ్ జాబితాలో జో బైడెన్‌, ఎలాన్‌ మస్క్‌, బిల్‌గేట్స్‌, జెఫ్ బెజోస్‌ వంటివారున్నారు. క్రిప్టో కరెన్సీ రూపంలో విరాళాలు ఇవ్వాలని అభ్యర్థిస్తూ వీరి ఖాతాల నుంచి ట్వీట్లు పోస్టు అయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని