Published : 07 Aug 2022 20:45 IST

NITI Aayog: సమష్టి కృషితోనే కరోనాను కట్టడి చేశాం.. రాష్ట్రాలకు ప్రధాని కితాబు

దిల్లీ: కరోనా మహమ్మారి నుంచి దేశం బయటపడగలిగిందంటే అది రాష్ట్రాల సమిష్టి కృషేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. సహకార సమాఖ్య స్ఫూర్తితో అన్ని రాష్ట్రాలు కలిసికట్టుగా కొవిడ్‌ను కట్టడిచేసేందుకు కృషిచేశాయని కొనియాడారు. నీతి ఆయోగ్‌ (NITI Aayog) గవర్నింగ్‌ కౌన్సిల్‌లో ప్రధాని ప్రసంగించారు. కరోనా కట్టడికి రాష్ట్రాలు సమర్థంగా చర్యలు తీసుకున్నాయన్నారు. తద్వారా అభివృద్ధి చెందుతున్న ప్రపంచ దేశాలకు భారత్‌ దిక్సూచిలా నిలిచిందని ప్రశంసించారు.

మహమ్మారి ప్రారంభమైన తర్వాత గవర్నింగ్ కౌన్సిల్‌కు సంబంధించి ఇది మొదటి భౌతిక సమావేశం కావడం విశేషం. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 23 మంది ముఖ్యమంత్రులు, ముగ్గురు లెఫ్టినెంట్ గవర్నర్లు, ఇద్దరు అడ్మినిస్ట్రేటర్లు, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో మోదీ వ్యవసాయం సహా మరిన్ని కీలక అంశాలపై మాట్లాడారు. వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయ రంగంలో సాంకేతిక వినియోగం పెరగాలన్నారు. ఈ రంగంలో ప్రపంచ అగ్రగామిగా భారత్‌ ఎదగాలని ఆశించిన ప్రధాని.. పంటల వైవిధ్యంపై అన్ని రాష్ట్రాలు దృష్టిసారించాలని సూచించారు. దేశ విద్యావిధానంపైనా ఆయన మాట్లాడారు. భారత సమాఖ్య వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందన్న మోదీ.. 2023లో జరిగే జీ-20 శిఖరాగ్ర సమావేశాలకు భారత్‌ అధ్యక్షత వహిస్తుందని తెలిపారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని