Published : 28 Jun 2022 02:04 IST

Mohammed Zubair: ఆల్ట్‌న్యూస్‌ సహ వ్యవస్థాపకుడు మహ్మద్‌ జుబైర్‌ అరెస్ట్‌

దిల్లీ: జర్నలిస్ట్‌, ఫ్యాక్ట్‌ చెక్‌ వెబ్‌సైట్‌ ‘ఆల్ట్‌ న్యూస్‌’ సహ వ్యవస్థాపకుడు మహ్మద్‌ జుబైర్‌ను దిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఒక వర్గం ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించారంటూ జుబైర్‌ను సోమవారం సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెక్షన్‌ 153, సెక్షన్‌ 295ఏ కింద కేసు నమోదు చేశారు. జుబైర్‌ అరెస్ట్‌ను ఆల్ట్‌ న్యూస్‌ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్‌ సిన్హా ధ్రువీకరించారు. 2020 నాటి కేసుకు సంబంధించి ఇవాళ దిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారని, అయితే ఆ కేసులో అరెస్ట్‌ చేయకుండా హైకోర్టు నుంచి జుబైర్‌కు రక్షణ ఉందని తెలిపారు. దీంతో మరో కేసులో జుబైర్‌ను అరెస్ట్‌ చేశారని, దానికి సంబంధించి ముందస్తు నోటీసులు గానీ, ఎఫ్‌ఐఆర్‌ కాపీ గానీ తమకు ఇవ్వలేదని ఆరోపించారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని