నోబెల్‌ శాంతి బహుమతి రేసులో ‘ఆల్ట్‌న్యూస్‌’ వ్యవస్థాపకులు

భారత్‌కు చెందిన ‘ఆల్ట్‌న్యూస్‌’ వ్యవస్థాపకులు మహ్మద్‌ జుబేర్‌‌, ప్రతీక్‌ సిన్హా నోబెల్‌ శాంతి బహుమతి రేసులో నిలిచారు.

Published : 06 Oct 2022 01:53 IST

దిల్లీ: భారత్‌కు చెందిన ‘ఆల్ట్‌న్యూస్‌’ వ్యవస్థాపకులు మహ్మద్‌ జుబేర్‌‌, ప్రతీక్‌ సిన్హా నోబెల్‌ శాంతి బహుమతి రేసులో నిలిచారు. మానవాళికి ప్రయోజనం కోసం పనిచేసేవారికి ఈ శాంతి బహుమతిని ఇస్తారు. ప్రస్తుతం నోబెల్‌ కమిటీ ఒక్కొక్క విభాగానికి బహుమతులను ప్రకటిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే శాంతి పురస్కారాన్ని ఈ నెల 7న  ప్రకటించనున్నారు.

2022 నోబెల్‌ శాంతి పురస్కారానికి గానూ మొత్తం వ్యక్తులు, సంస్థలు కలిపి 343 మంది పోటీలో ఉన్నారు. ఇందులో పలు దేశాలకు చెందిన రాజకీయ నాయకులతో పాటు భారత్‌కు చెందిన ఫ్యాక్ట్‌ చెక్‌ వెబ్‌సైట్‌ ఆల్ట్‌ న్యూస్‌ వ్యవస్థాపకులూ ఉన్నారని తెలిసింది. నోబెల్‌ కమిటీ అధికారికంగా ఈ వివరాలు వెల్లడించనప్పటికీ.. రాయిటర్స్‌ వార్తా సంస్థ నిర్వహించిన సర్వేలో ఆల్ట్‌న్యూస్‌ వ్యవస్థాపకులతో పాటు, పలువురు నోబెల్‌ శాంతి బహుమతికి నామినేట్‌ అయిన వారిలో ఉన్నారని తెలిసింది. వీరితో పాటు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, గ్రెటా దన్‌బెర్గ్‌, డబ్ల్యూహెచ్‌ఓ, పోప్‌ ఫ్రాన్సిస్‌ వంటి వారు రేసులో ఉన్నారు. 

భారత్‌లో ఫేక్‌ న్యూస్‌ కట్టడికి ‘ఆల్ట్‌న్యూస్‌’ పనిచేస్తోంది. సోషల్‌మీడియాలో ప్రచారంలో ఉండే నకిలీ సమాచారాన్ని విశ్లేషించి వాస్తవాలను తన వెబ్‌సైట్‌లో పెడుతోంది. అయితే, ఇటీవల ‘ఆల్ట్‌న్యూస్‌’ వ్యవస్థాపకుల్లో ఒకరైన మహ్మద్‌ జుబేర్‌ను ఈ ఏడాది జూన్‌లో దిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. నాలుగేళ్ల క్రితం నాటి ఓ ట్వీట్‌ వ్యవహారంలో అరెస్ట్‌ చేయగా.. నెల రోజుల తర్వాత సుప్రీం కోర్టు అతడికి బెయిల్‌ మంజూరు చేసింది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని