US-CHINA: చైనాలో మానవహక్కుల ఉల్లంఘనలు..అమెరికా మరో నిషేధాస్త్రం!

కమ్యూనిస్టు దేశం చైనాలో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని అమెరికా ఆవేదన వ్యక్తం చేస్తోంది. డ్రాగన్‌ ప్రభుత్వం తీరుకు నిరసనగా బీజింగ్‌లో జరిగే శీతాకాల ఒలింపిక్స్‌ను దౌత్యపరంగా నిషేధించిన అమెరికా.. ఇప్పుడు చైనాకు మరో షాక్‌ ఇచ్చింది. షిన్జియాంగ్‌ ప్రాంతం నుంచి అమెరికాలో దిగుమతి

Published : 24 Dec 2021 14:34 IST

వాషింగ్టన్‌: కమ్యూనిస్టు దేశం చైనాలో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని అగ్రరాజ్యం అమెరికా ఆవేదన వ్యక్తం చేస్తోంది. డ్రాగన్‌ ప్రభుత్వం తీరుకు నిరసనగా బీజింగ్‌లో జరిగే శీతాకాల ఒలింపిక్స్‌ను దౌత్యపరంగా నిషేధించిన అమెరికా.. ఇప్పుడు చైనాకు మరో షాక్‌ ఇచ్చింది. షిన్జియాంగ్‌ ప్రాంతం నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువులపై నిషేధం విధించింది. ఈ మేరకు తీసుకొచ్చిన ‘ఉయ్‌ఘర్‌ ఫోర్స్‌డ్‌ లేబర్‌ ప్రివెన్షన్‌ యాక్ట్‌’ బిల్లుపై గత వారమే కాంగ్రెస్‌ ఆమోదం తెలపగా.. తాజాగా దేశాధ్యక్షుడు జో బైడెన్‌ దానిపై సంతకం చేశారు. 

చైనాలో స్వయంప్రతిపత్తి కలిగిన ఈ షిన్జియాంగ్‌ ప్రాంతం.. ఆ దేశ ఆర్థిక వ్యవస్థలోనూ కీలక పాత్ర పోషిస్తోంది. ఇక్కడి నుంచే అమెరికాకు ఏటా 20 శాతం మేర వస్త్రాలు దిగుమతి అవుతుంటాయి. ఇప్పుడు వాటిపై అగ్రరాజ్యం నిషేధం విధించింది. కాగా.. ఇది అమెరికా తీసుకున్న ఎంతో ముఖ్యమైన, ప్రభావంతమైన చర్య అని రిపబ్లికన్‌ సెనేటర్‌ మార్కో రుబియో అభిప్రాయపడ్డారు. కార్మికులను బానిసలకు మార్చడం పట్ల చైనా కమ్యూనిస్ట్ పార్టీ బాధ్యత వహించాలనే అమెరికా ఈ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు.

Read latest National - International News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని