pfizer vaccine: నెల వరకు సాధారణ ఫ్రిజ్లోనే!
ఫైజర్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను నెలవరకు సాధారణ రిఫ్రిజిరేటర్లలో నిల్వ ఉంచుకోవచ్చని అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ వెల్లడించింది.
అనుమతించిన అమెరికా ఎఫ్‌డీఏ
వాషింగ్టన్: ఫైజర్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను నెల వరకు సాధారణ రిఫ్రిజిరేటర్లలో నిల్వ ఉంచుకోవచ్చని అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ వెల్లడించింది. వ్యాక్సిన్ నిల్వపై ఫైజర్ అందించిన తాజా సమాచారం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) పేర్కొంది. దీంతో ఫైజర్ టీకాను సాధారణ రిఫ్రిజిరేటర్లో(2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ వద్ద) నెల వరకు పెట్టుకోవచ్చని తెలిపింది. అంతకుముందు కేవలం ఐదు రోజులు మాత్రమే నిల్వ చేసుకునేందుకు ఉన్న నిబంధనను సడలిస్తూ ఎఫ్‌డీఏ తీసుకున్న నిర్ణయంతో వ్యాక్సిన్ సరఫరా వేగవంతం అవుతుందని నిపుణులు భావిస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ వాటి నిల్వ, సరఫరాలో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్న విషయం తెలిసిందే. కొన్ని వ్యాక్సిన్లను నిల్వ చేసేందుకు అత్యల్ప ఉష్ణోగ్రతలు అవసరమవడం ఇబ్బందిగా మారింది. ఇలాంటి సమస్యల వల్లే చాలా దేశాలు ఆ వ్యాక్సిన్లను దిగుమతి చేసుకోలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఫైజర్ వ్యాక్సిన్ సాధారణ రిఫ్రిజిరేటర్లలో నెలవరకు నిల్వ చేసుకునేందుకు ఎఫ్‌డీఏ అనుమతి ఇవ్వడం ఊరట కలిగించే విషయం. ఇదే వ్యాక్సిన్‌ను సాధారణ ఉష్ణోగ్రతల వద్ద నిల్వ ఉంచుకునేందుకు యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ కూడా ఈమధ్యే అనుమతి ఇచ్చింది. అంతకు ముందు ఫైజర్ వ్యాక్సిన్‌ను -80 నుంచి -60 డిగ్రీల సెల్సియస్‌తో కూడిన అత్యంత శీతల ప్రదేశాల్లో నిల్వ చేయాల్సి వచ్చింది. సుదీర్ఘ కాలం పాటు నిల్వచేయాలంటే మాత్రం ఈ ఉష్ణోగ్రతలు ఉండాల్సిందే.
ఇదిలా ఉంటే, భారత్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నప్పటికీ డిమాండ్‌కు సరిపడా డోసులు అందుబాటులోకి రాలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా రాష్ట్రాలు వ్యాక్సిన్ల కోసం గ్లోబల్ టెండర్లను ఆహ్వానిస్తున్నాయి. దీంతో భారత్‌లో అనుమతి పొందిన మూడు వ్యాక్సిన్లతో పాటు ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ వంటి విదేశీ వ్యాక్సిన్ల సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Supreme Court: ఎమ్మెల్యేలకు ఎర కేసు.. అత్యవసర విచారణకు సీజేఐకి విజ్ఞప్తి
-
World News
Mumbai terror attacks: 2008 ఉగ్రదాడి గాయం గుర్తులు ఇంకా మానిపోలేదు: అమెరికా
-
Politics News
Balasaheb Thorat: మహారాష్ట్రలో కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్.. పార్టీ పదవికి థోరట్ రాజీనామా!
-
Sports News
IND vs AUS: నాగ్‌పుర్‌లో ‘టెస్టు’ రికార్డులు.. ఆధిక్యం ఎవరిదంటే..?
-
India News
Job Vacancies: కేంద్ర సాయుధ బలగాల్లో ఉద్యోగ ఖాళీలు ఎన్నంటే?: కేంద్రం
-
Movies News
Aditi Gautam: వైభవంగా ‘నేనింతే’ హీరోయిన్ వివాహం