
ట్రంప్,బైడెన్ హోరాహోరీ
పలు రాష్ట్రాల్లో పూర్తయిన పోలింగ్
దక్షిణాది రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఓటింగ్
పలు చోట్ల వెలువడిన ఫలితాలు
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తూర్పు రాష్ట్రాల్లో ఇప్పటికే ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది. దక్షిణాది రాష్ట్రాల్లో పోలింగ్ కొనసాగుతోంది. తొలుత పోలింగ్ పూర్తయిన చిన్న రాష్ట్రాల ఫలితాలు కూడా వెలువడుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో విజయం సాధించి ఇరువురు అభ్యర్థులు విజయంపై ధీమాగా ఉన్నారు. మరోవైపు ఓటింగ్‌కు ప్రజలు భారీ ఎత్తున తరలివస్తున్నారు. గత 100 ఏళ్ల అమెరికా చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో ఓటింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే 10 కోట్ల మంది మెయిల్ బ్యాలెట్ల ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న విషయం తెలిసిందే. ఇక నేడు నేరుగా పోలింగ్ బూత్‌లలో ఓటు వేయడానికి ప్రజలు భారీ ఎత్తున చేరుకుంటున్నారు.
ట్రంప్ గెలిచిన రాష్ట్రాలు..
వెస్ట్ వర్జీనియా, కెంటకీ, సౌత్ కరోలైనా, ఒక్లహామా, అర్కన్సాస్, టెన్నెసీ, ఇండియానా, మిస్సిసిపీ, అలబామా. కీలక రాష్ట్రంగా భావిస్తున్న ఫ్లోరిడా, జార్జియాలో ట్రంప్ ముందంజలో ఉండడం గమనార్హం. నార్త్ డకోటా, మిషిగాన్, మెనీ రాష్ట్రాల్లోనూ ట్రంప్ ఆధిక్యం కొనసాగుతోంది.
బైడెన్ గెలిచిన రాష్ట్రాలు..
వర్జీనియా, వెర్మాంట్, ఇల్లినాయిస్, మేరీలాండ్, డెలావెర్, న్యూజెర్సీ, కనెక్టీకట్, మసాచుసెట్స్, రోడ్ ఐలాండ్ రాష్ట్రాల్లో జో బైడెన్ గెలుపొందారు. టెక్సాస్, కాన్సాస్, మిస్సౌరీ, ఒహైయో, పెన్సిల్వేనియా, న్యూ హాంప్‌షైర్, నార్త్ కరోలైనా రాష్ట్రాల్లో బైడెన్ ప్రస్తుతానికి ముందంజలో ఉన్నారు.
* ఇప్పటి వరకు బైడెన్ 85 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు సాధించి ముందంజలో ఉండగా.. ట్రంప్ 72 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు సాధించారు. అయితే, పాపులర్ ఓట్లలో మాత్రం తొలి నుంచి ట్రంప్ ఆధిక్యత కనబరుస్తున్నారు. మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లకు గానూ 270 ఓట్లు సాధించిన అభ్యర్థి విజయం సాధిస్తారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Most Expensive Pillow: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దిండు.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!
-
General News
Health: వృద్ధాప్యం వస్తే ఏం తినాలో తెలుసా..?
-
India News
Agnipath: అగ్నిపథ్‌కు దరఖాస్తుల వెల్లువ.. మూడు రోజుల్లోనే ఎన్ని వచ్చాయంటే..?
-
India News
Election Commission: పార్టీల రిజిస్ట్రేషన్ రద్దు చేసే అధికారం మాకివ్వండి: ఈసీ
-
World News
Ukraine Crisis: జీ-7 సదస్సు వేళ.. కీవ్‌పై విరుచుకుపడిన రష్యా!
-
Politics News
AAP: ఆప్‌కు చుక్కెదురు! సీఎం మాన్ ఖాళీ చేసిన ఎంపీ స్థానంలో ఓటమి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Chiranjeevi: నాకూ గోపీచంద్‌కు ఉన్న సంబంధం అదే: చిరంజీవి
- Weddings: వివాహాల్లో భారీ అలంకరణలు, డీజే సౌండ్లు బంద్.. వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందే..
- Bypolls: యూపీలో భాజపాకు బిగ్ బూస్ట్.. పంజాబ్‌లో ఆప్‌కు భంగపాటు
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- E Passport: ఈ పాస్‌పోర్ట్‌లు వస్తున్నాయ్.. ఎప్పటి నుంచి జారీ చేస్తారు?ఎలా పనిచేస్తాయి?
- PCOD: అధిక బరువుకు బై బై చెప్పేద్దామా.. పరిష్కార మార్గాలివిగో..!
- Droupadi Murmu: ఎట్టకేలకు మోక్షం.. ద్రౌపదీ ముర్ము స్వగ్రామానికి కరెంటు..!
- అక్కడి మహిళలు ఆ ఒక్క రోజే స్నానం చేస్తారట!
- Agnipath: అగ్నిపథ్‌కు దరఖాస్తుల వెల్లువ.. మూడు రోజుల్లోనే ఎన్ని వచ్చాయంటే..?
- Matoshree: మాతోశ్రీకి ఎందుకు తిరిగి వచ్చారంటే?