PUBG: ‘పబ్‌జీ’ ప్రియుడి కోసం.. భారత్‌కు అమెరికా యువతి

పబ్‌జీ ఆడుతూ ప్రేమలో పడి భారత్‌కు వచ్చిన పాక్‌ మహిళ సీమా హైదర్‌ తరహాలోనే మరో ప్రేమకథ వెలుగులోకి వచ్చింది. ఈసారి అమెరికాలోని ఫ్లోరిడా నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌కు వచ్చిన యువతిని ఇటావా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Published : 16 Jun 2024 06:13 IST

పబ్‌జీ ఆడుతూ ప్రేమలో పడి భారత్‌కు వచ్చిన పాక్‌ మహిళ సీమా హైదర్‌ తరహాలోనే మరో ప్రేమకథ వెలుగులోకి వచ్చింది. ఈసారి అమెరికాలోని ఫ్లోరిడా నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌కు వచ్చిన యువతిని ఇటావా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫ్లోరిడాకు చెందిన బ్రూక్లిన్‌ (30) అనే యువతికి ఇటావా యువకుడు హిమాన్షు యాదవ్‌తో పబ్‌జీ ఆట ద్వారా పరిచయం పెరిగి ప్రేమగా మారింది. హిమాన్షు కోసం కొన్ని నెలల క్రితం ఆమె చండీగఢ్‌కు చేరుకొంది. ప్రియురాలిని కలవడానికి హిమాన్షు కూడా చండీగఢ్‌కు వెళ్లాడు. ఆమెను అక్కడే పెళ్లాడి, కొద్దిరోజులు గడిపిన తరవాత ఇటావాకు తీసుకొచ్చాడు. స్థానికులు ఆమెను అనుమానించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో మళ్లీ చండీగఢ్‌కు వెళ్లిపోయేందుకు ఇద్దరూ ఆర్టీసీ బస్సు ఎక్కగా.. ముందుగా ఉన్న సమాచారంతో డ్రైవరు ఆ బస్సును నేరుగా పోలీస్‌స్టేషనుకు తీసుకుపోయాడు. అప్రమత్తంగా ఉన్న పోలీసులు బ్రూక్లిన్, హిమాన్షులను అదుపులోకి తీసుకొని విచారించారు. ఆ యువతి పూర్తి అంగీకారంతోనే హిమాన్షుతో కలిసి చండీగఢ్‌ వెళ్లాలనుకుంటోందని రూరల్‌ ఎస్పీ విజయ్‌సింగ్‌ చెప్పారు.

ఈటీవీ భారత్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని