అమెరికాను వణికిస్తున్న మంచు తుపాను

అమెరికాను భారీ మంచు తుపాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ముఖ్యంగా టెక్సాస్‌ రాష్ట్రంలో మైనస్‌ 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో అక్కడి రహదారులన్నీ మంచుతో పేరుకుపోయాయి....

Published : 16 Feb 2021 13:10 IST

వాషింగ్టన్‌: అమెరికాను భారీ మంచు తుపాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ముఖ్యంగా టెక్సాస్‌ రాష్ట్రంలో మైనస్‌ 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో అక్కడి రహదారులన్నీ మంచుతో పేరుకుపోయాయి. మంచు నిండిపోయిన రహదారులపై వాహనాలు నడపడం ద్వారా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. హూస్టన్‌ నగర పరిసరాల్లో సుమారు 120 రహదారి ప్రమాదాలు జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. ఓ చోట 10 కార్లు ఒకదానికొకటి ఢీకొన్నట్లు తెలిపారు. దీనికి తోడు అతిశీతల పరిస్థితుల వల్ల విద్యుత్తు వినియోగం భారీ ఎత్తున పెరగడంతో విద్యుత్తు కొరత ఏర్పడింది. దీంతో విద్యుత్తు నిర్వహణ సంస్థలు కోతలు అధికం చేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని రోజులు కరెంటు కోతలకు సిద్ధంగా ఉండాలని అధికారులు వెల్లడించారు. టెక్సాస్‌లో పరిస్థితి దారుణంగా ఉండటంతో అధ్యక్షుడు జో బైడెన్‌ అత్యవసర పరిస్థితిని విధించారు.
 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని