
ఒమిక్రాన్ కలవరం.. పలు రాష్ట్రాల్లోఎన్నికలపై 27న ఈసీ కీలక సమావేశం!
దిల్లీ: దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో పలు రాష్ట్రాలు మళ్లీ ఆంక్షల వలయంలోకి జారుకుంటున్నాయి. వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం - కేంద్ర ఆరోగ్యశాఖతో కీలక సమావేశం ఏర్పాటు చేయనుంది. ఈ నెల 27న (సోమవారం) కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులతో జరగబోయే సమావేశంలో దేశంలో ప్రస్తుతం కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్ ప్రభావం తదితర అంశాలపై చర్చించనున్నట్టు సమాచారం. అలాగే, యూపీ, పంజాబ్ సహా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.
మరోవైపు, ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో యూపీతో పాటు పలు రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంపై నిషేధం విధించాలని, అలాగే, ఎన్నికలను కూడా వాయిదా వేయాలని అలహాబాద్ హైకోర్టు కేంద్రం, కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరిన నేపథ్యంలో జరగబోయే ఈ భేటీ కీలక ప్రాధాన్యం సంతరించుకొంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో జరగనున్న యూపీ సహా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కూడా.. వీలైతే రెండు నెలల పాటు వాయిదా వేయాలంటూ అలహాబాద్ హైకోర్టు కేంద్రాన్ని కోరింది. ‘‘మనుషులు ప్రాణాలతో ఉంటేనే కదా.. ప్రచారాలైనా.. ఎన్నికలైనా. ఒకవేళ ఇప్పుడు చర్యలు తీసుకోకపోతే రెండో దశ కంటే దారుణమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అంటూ కోర్టు నిన్న హెచ్చరించిన విషయం తెలిసిందే.
► Read latest National - International News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.