Omicron: పెరుగుతున్న ఒమిక్రాన్‌ కేసులు.. అమెరికా కీలక ప్రకటన

దేశంలో కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్’ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో.. అమెరికా తాజాగా కీలక ప్రకటన చేసింది. భారత్‌తోసహా ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కొవిడ్‌ నెగెటివ్‌ రిపోర్టు లేదా 90 రోజుల వ్యవధిలో వైరస్‌ బారిన పడి కోలుకున్నట్లు ఆధారాలు...

Published : 05 Dec 2021 14:14 IST

వాషింగ్టన్‌: దేశంలో కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్’ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో.. అమెరికా తాజాగా కీలక ప్రకటన చేసింది. భారత్‌తోసహా ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కొవిడ్‌ నెగెటివ్‌ రిపోర్టు లేదా 90 రోజుల వ్యవధిలో వైరస్‌ బారిన పడి కోలుకున్నట్లు ఆధారాలు తీసుకురావడాన్ని తప్పనిసరి చేసింది. ఈ కొత్త నిబంధనలు డిసెంబర్ 6 నుంచి అమల్లోకి వస్తాయని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ (హెచ్‌హెచ్‌ఎస్)లోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) వెల్లడించింది. 

ప్రయాణానికి ఒకరోజు ముందు..

రెండేళ్లు, ఆపై వయసున్న ప్రయాణికులకు ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయని అధికారులు వెల్లడించారు. నెగెటివ్‌ రిపోర్టు సైతం.. ప్రయాణానికి ఒకరోజు ముందు చేయించుకున్న పరీక్షకు సంబంధించినదై ఉండాలని చెప్పారు. దీంతోపాటు ప్రయాణికులు తాము సమర్పించిన వివరాలు సరైనవే అని ధ్రువీకరించాల్సి ఉంటుందన్నారు. ఇదిలా ఉండగా, అగ్రరాజ్యంలోని ఒక్క న్యూయార్క్‌లోనే ఇప్పటి వరకు ఎనిమిది ఒమిక్రాన్‌ కేసులు నమోదైన విషయం తెలిసిందే. మసాచుసెట్స్‌, వాషింగ్టన్‌, న్యూజెర్సీ తదితర రాష్ట్రాల్లోనూ కేసులు వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని