జవాన్ల కోసం ‘ఆయుష్మాన్‌ సీఏపీఎఫ్‌’ పథకం 

ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య బీమా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం సాయుధ బలగాలకూ వర్తింపజేసింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా..........

Published : 23 Jan 2021 22:22 IST

గువాహటిలో ప్రారంభించిన అమిత్‌ షా

గువాహటి: ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య బీమా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం సాయుధ బలగాలకూ వర్తింపజేసింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ‘ఆయుష్మాన్‌ సీఏపీఎఫ్‌’ పథకాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అసోంలోని గువాహటిలో కేంద్ర సాయుధ బలగాలకు చెందిన కొందరు జవాన్లకు ఆరోగ్య కార్డులను పంపిణీ చేశారు. ఈ పథకం ద్వారా 10 లక్షల మంది జవాన్లు, వారి కుటుంబాలకు లబ్ధి కలగనుంది. ‘ఆయుష్మాన్‌ సీఏపీఎఫ్‌’ పథకం ద్వారా దేశంలోని 24 వేల ఆస్పత్రుల్లో చికిత్స పొందొచ్చు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య అథారిటీ, కేంద్ర హోంమంత్రిత్వశాఖ మధ్య పరస్పర అవగాహన ఒప్పందం కుదిరింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, అసోం సీఎం సర్వానంద్‌ సోనోవాల్‌, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌, రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హిమంత బిశ్వశర్మ సమక్షంలో అధికారులు గువాహటిలోని సీఆర్‌పీఎఫ్‌ గ్రూప్‌ సెంటర్‌ వద్ద సంతకాలు చేశారు.

ఇదీ చదవండి..

జీఎస్టీ గుదిబండ.. మార్చేస్తాం: రాహుల్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని