Amit Shah: పాకిస్థాన్‌తో చర్చలు జరిపే ప్రసక్తే లేదు: అమిత్ షా
దాయాది పాకిస్థాన్‌తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీవ్రవాదాన్ని సమూలంగా నాశనం చేస్తుందని చెప్పారు. జమ్ముకశ్మీర్‌ని దేశంలోనే అత్యంత శాంతియుతమైన ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు.
బారాముల్లా: దాయాది పాకిస్థాన్‌తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేస్తుందని చెప్పారు. జమ్ముకశ్మీర్‌ని దేశంలోనే అత్యంత శాంతియుతమైన ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. జమ్ముకశ్మీర్ పర్యటనలో ఉన్న అమిత్ షా.. రెండో రోజు బారాముల్లాలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో మాట్లాడారు.ఉగ్రవాదం వల్ల ఎవరైనా లబ్ధి పొందారా? అని అక్కడున్న వారిని ప్రశ్నించారు. 1990 నుంచి ఇప్పటి వరకు 42 వేల మందిని ఉగ్రవాదం పొట్టన పెట్టుకుందని చెప్పారు.
వరుసగా రెండో రోజు కూడా అమిత్‌షా ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. జమ్ముకశ్మీర్ అభివృద్ధిలో వెనకబడిపోవడానికి అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), ముఫ్తీ (పీడీపీ), నెహ్రూ-గాంధీ (కాంగ్రెస్) కుటుంబాలే కారణమని మండిపడ్డారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఉమ్మడి జమ్ముకశ్మీర్‌ను ఈ మూడు కుటుంబాలే ఎక్కువ కాలం పాలించాయని చెప్పారు. ఆ మూడు పార్టీలు అవినీతిలో మునిగిపోయాయని చెప్పారు. వారికి పరిపాలన చేతకాక, అభివృద్ధి లేమితో వెనకబడిపోయిన దేశాన్ని మోదీ ప్రగతి పథంలో నడిపిస్తున్నారని చెప్పారు.
‘‘ పాకిస్థాన్‌తో చర్చలు జరపాలని కొందరు చెబుతున్నారు. పాకిస్థాన్‌తో మనం ఎందుకు చర్చలు జరపాలి? అది జరగని పని. మేం బారాముల్లా ప్రజలతో మాట్లాడతాం. జమ్ముకశ్మీర్ ప్రజలతో మాట్లాడతాం’’ అని అమిత్ షా అన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని సహించబోదని, జమ్ము కశ్మీర్‌ను దేశంలోనే శాంతియుత ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో ఎన్ని గ్రామాలకు విద్యుత్ సదుపాయం ఉందని అమిత్ షా అక్కడున్న వారిని ప్రశ్నించారు. గత మూడేళ్లలో కశ్మీర్‌లోని అన్ని గ్రామాలకు విద్యుత్ అందించామని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Nitin Gadkari: అమితాబ్ సినిమా మూడుసార్లు చూశా: గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు
మిగతా నటీనటుల యాక్టింగ్ నచ్చినప్పటికీ.. అమితాబ్ బచ్చనే (Amitabh Bachchan) తనకు ఇష్టమైన నటుడని భాజపా సీనియర్ నేత నితిన్ గడ్కరీ (Nitin Gadkari) చెప్పారు. -
Supreme Court: తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో.. రామ్‌దేవ్‌బాబాకు సుప్రీంకోర్టు సమన్లు
తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో ధిక్కార పిటిషన్‌పై సమాధానం ఇవ్వడంలో విఫలమైనందుకు పతంజలి సంస్థపై సుప్రీంకోర్టు(Supreme Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. -
Liquor Policy Case: రూ.100కోట్ల చెల్లింపులపై ఈడీ ప్రకటన.. అక్రమంగా ఒక్క రూపాయీ లేదన్న ఆప్
Liquor Policy Case: దిల్లీ మద్యం కుంభకోణంలో భారాస ఎమ్మెల్సీ కవిత తమ నేతలకు రూ.100 కోట్లు చెల్లించడంలో భాగస్వామి అయ్యారని ఈడీ చేసిన ప్రకటనపై ఆమ్ ఆద్మీ పార్టీ మండిపడింది. ఇదంతా కుట్రలో భాగమేనని ఆరోపించింది. -
Modi: ‘మీవాళ్లు క్షేమంగా ఉన్నారు..త్వరలో తిరిగొస్తారు’: బల్గేరియా అధ్యక్షుడికి మోదీ రిప్లై
తమ దేశీయుల్ని రక్షించడంలో భారత నౌకాదళం ప్రదర్శించిన ధైర్యసాహసాలకు బల్గేరియా నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. వీటికి ప్రధాని మోదీ(Modi) స్పందించారు. -
Gadchiroli: గడ్చిరోలిలో ఎదురుకాల్పులు.. నలుగురు మావోయిస్టుల హతం
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. -
సర్కార్ సొమ్ము కోసం అన్నాచెల్లెళ్ల పెళ్లి
ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన సీఎం సామూహిక వివాహ పథకం ద్వారా వచ్చే ప్రయోజనాలను పొందేందుకు అన్నాచెల్లెళ్లు పెళ్లి చేసుకున్నారు. మహారాజ్‌గంజ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. -
దుస్తుల్లేని చిన్ననాటి ఫొటోపై అభ్యంతరం.. అకౌంట్‌ను నిలిపివేసిన గూగుల్
చిన్నప్పటి ఫొటోను డ్రైవ్‌లోకి అప్లోడ్ చేసిన వ్యక్తికి గూగుల్ షాకిచ్చింది. అతడి అకౌంట్‌ను నిలిపివేసింది. దీనిపై ఏడాదిగా గూగుల్‌తో పోరాడుతున్నా ఫలితం లేకపోవడంతో బాధితుడు గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. -
ఎన్నికల బాండ్ల సమాచారమంతా వెల్లడించాల్సిందే
ఎన్నికల బాండ్ల అంశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) అనుసరిస్తున్న వైఖరిపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంపిక చేసుకున్న సమాచారాన్ని మాత్రమే ఇవ్వాలన్న ధోరణిని బ్యాంక్ విడనాడాలని, మొత్తం వివరాలు ఈ నెల 21లోపు బహిర్గతం చేయాలని ఆదేశించింది. -
పశ్చిమ బెంగాల్ డీజీపీపై వేటు
సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. పశ్చిమ బెంగాల్ డీజీపీతోపాటు 6 రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులను తప్పించింది. వారితోపాటు రెండు రాష్ట్రాల్లో సాధారణ పరిపాలనశాఖ కార్యదర్శులను బదిలీ చేసింది. -
ఆజం ఖాన్‌కు ఏడేళ్ల జైలుశిక్ష
ఉత్తర్‌ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజం ఖాన్‌కు స్థానిక కోర్డు ఏడేళ్ల జైలుశిక్షను విధించింది. 2016లో దుంగార్పుర్లో ఒక ఇంటిని బలవంతంగా కూల్చివేసిన కేసులో ఈ శిక్షను ఖరారు చేసింది. -
‘సామాజిక’ ప్రచారం
ప్రపంచంలోనే అతి పెద్ద ఎన్నికల ప్రక్రియకు దేశం సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఓటర్లను ఆకర్షించేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నాలను ప్రారంభించాయి. ఇందులో భాగంగా వాట్సప్, సామాజిక మాధ్యమాలు, ఇన్ఫ్లుయెన్సర్లకు గిరాకీ పెరిగింది. -
వేడెక్కుతున్న ఉత్తర భారతం
ఉత్తర భారతంలో 1970 నుంచి శీతాకాలం క్రమంగా ఎండా కాలంగా మారిపోతోందని అమెరికన్ శాస్త్రజ్ఞుల బృందం క్లైమేట్ సెంట్రల్ హెచ్చరించింది. ఈ బృందం 1970 నుంచి డిసెంబరు-ఫిబ్రవరి కాలంలో ఉత్తర భారత్‌లో ఉష్ణోగ్రతల తీరుతెన్నులను విశ్లేషించింది. -
స్నేహమంటే అదే కదా.. నేవీ ఆపరేషన్‌పై జై శంకర్ స్పందన
సోమాలియా సముద్రపు దొంగల చేతిలో హైజాక్‌కు గురైన ఓ వాణిజ్య ఓడను భారత నౌకాదళం కాపాడిన విషయం తెలిసిందే. దాంతో మన రక్షణ సిబ్బంది చేసిన ఆపరేషన్‌పై బల్గేరియా నుంచి కృతజ్ఞతలు వ్యక్తమయ్యాయి. -
మమ్మల్ని దర్యాప్తు సంస్థలా మార్చకండి
గుజరాత్ యూనివర్సిటీలో గత వారాంతంలో విదేశీ విద్యార్థులపై చోటు చేసుకున్న దాడిని సుమోటోగా స్వీకరించాలంటూ ఓ న్యాయవాది దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) ఆ రాష్ట్ర హైకోర్టు సోమవారం తిరస్కరించింది. -
పోలీసు కాల్పుల్లో ఉపాధ్యాయుడి మృతి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో చిన్నపాటి ఘర్షణ కారణంగా హెడ్ కానిస్టేబుల్ కాల్పులు జరపడంతో ఓ ఉపాధ్యాయుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన సివిల్ లైన్స్ ప్రాంతంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. -
హిమాచల్‌ప్రదేశ్ కాంగ్రెస్ రెబల్స్‌కు సుప్రీంకోర్టులో దక్కని ఊరట
కాంగ్రెస్ పార్టీ విప్‌ను ధిక్కరించి ఎమ్మెల్యే పదవికి అనర్హులైన ఆరుగురు రెబల్స్‌కు సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట లభించలేదు. -
వివక్షతో ఉద్యోగాలు నిరాకరించొద్దు
ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ట్రాన్స్జెండర్లపై వివక్ష ఉండకూడదని, వారికి సమాన అవకాశాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. -
వ్యక్తిగత హోదాలోనే విరాళాలిచ్చాను
ప్రముఖ ఔషధ తయారీ సంస్థ బయోకాన్ లిమిటెడ్.. ఏ పార్టీకీ ఎన్నికల బాండ్ల ద్వారా విరాళాలివ్వలేదని ఆ సంస్థ ఛైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా సోమవారం వెల్లడించారు. -
ఈడీ సమన్లను లెక్కచేయని కేజ్రీవాల్
నగదు అక్రమ చలామణి కేసులో ప్రశ్నలకు జవాబివ్వడానికి సోమవారం రావాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీచేసిన సమన్లను దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లెక్కచేయలేదు. -
సాంక్రమికేతర వ్యాధులను పెంచుతున్న ఆహారపుటలవాట్లు
భారతీయుల ఆహారంలో మితిమీరిన ఉప్పు వినియోగం, సరిపడా పొటాషియం లేకపోవడం వంటి ఆందోళనకర పోకడలు పెరుగుతున్నాయని తాజా పరిశోధన తేల్చింది. -
భారత నౌకాదళం భేష్: అమెరికా రక్షణ మంత్రి ప్రశంస
హిందూ మహాసాగరంలో సముద్రపు దొంగల ఆటకట్టించే ఆపరేషన్ల నిర్వహణలో భారత నౌకాదళ పాత్రను అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ కొనియాడారు. శుక్రవారం భారత నౌకాదళం నడి సముద్రంలో సాహసోపేత ఆపరేషన్ నిర్వహించి..
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ నూతన గవర్నర్‌గా బుధవారం బాధ్యతలు స్వీకరించనున్న రాధాకృష్ణన్
-
Nitin Gadkari: అమితాబ్ సినిమా మూడుసార్లు చూశా: గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు
-
IMD: తెలంగాణలో రెండ్రోజులపాటు వర్షాలు
-
Realme Narzo 70 Pro: ఎయిర్ గెశ్చర్స్ ఫీచర్‌తో రియల్మీ నార్జో 70 ప్రో
-
IPL: హామీ ఇస్తున్నా.. అప్పటిలోపు కేకేఆర్‌ను బెటర్ పొజిషన్లో ఉంచుతా: గంభీర్
-
RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ ప్రీక్లైమాక్స్‌లో చేసిన మార్పు ఇదే.. జెన్నీ పాత్ర చనిపోతుందట!