Amitabh Bachchan-Anushka: హెల్మెట్లు లేకుండా అనుష్క-అమితాబ్.. ముంబయి పోలీస్ స్పందన
బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan), అనుష్క శర్మ(Anushka Sharma) చిత్రాలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వాటిపై నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..?
ముంబయి: ట్రాఫిక్‌ను తప్పించుకొని అనుకున్న సమయానికి తమ గమ్యస్థానాలు చేరేందుకు బాలీవుడ్ స్టార్లు అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan ), అనుష్క శర్మ(Anushka Sharma) ద్విచక్ర వాహనాలను ఆశ్రయించారు. అమితాబ్ కారు దిగి, రోడ్డుపై వెళ్తోన్న ఓ వ్యక్తి బైక్ ఎక్కగా.. అనుష్క కూడా దాదాపు ఇలాగే డబ్బింగ్ స్టూడియోకు వెళ్లారు. అయితే వారితోపాటు బండి నడుపుతున్నవారు హెల్మెట్లు పెట్టుకోలేదు. దీనిపై ఇప్పుడు ముంబయి పోలీసులు(Mumbai Police) స్పందించారు.
ఇటీవల అమితాబ్(Amitabh Bachchan) ఓ సామాన్యుడి బైక్‌పై షూటింగ్ స్థలానికి వెళ్తూ ముంబయి వీధుల్లో కనిపించారు. తనకు లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తికి థ్యాంక్స్ చెప్పారు. ‘‘నువ్వు ఎవరో నాకు తెలీదు.. కానీ సమయానికి నన్ను షూటింగ్ జరిగే ప్రదేశానికి తీసుకెళ్లావు. ట్రాఫిక్‌లో చిక్కుకుపోకుండా సాయం చేశావు’’ అంటూ అతడికి ధన్యవాదాలు చెప్పారు. ఇదే విధంగా అనుష్క(Anushka Sharma) కూడా కారులో స్టూడియో వెళ్తుంటే.. చెట్టు పడిపోవడం వల్ల దారంతా ట్రాఫిక్ జామ్ అయింది. దాంతో ఆమె కూడా ఓ వ్యక్తి బండి మీద స్టూడియోకు చేరుకున్నారు. పనిపట్ల వీరికున్న నిబద్ధతను కొందరు ప్రశంసించగా.. మరికొందరు మాత్రం హెల్మెట్లు ధరించలేదని ప్రశ్నించారు. ఈ విషయాన్ని ముంబయి పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై పోలీసులు స్పందిస్తూ.. ఈ విషయాన్ని ట్రాఫిక్ విభాగం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.
ప్రస్తుతం అమితాబ్.. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న ‘ప్రాజెక్ట్ కె’ (Project K)లో నటిస్తున్నారు. మరోవైపు అనుష్క.. భారత మహిళా క్రికెటర్ జులన్ గోస్వామి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘చక్దా ఎక్స్‌ప్రెస్’లో సందడి చేయనున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Wrestlers Protest: రెజ్లర్లకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం.. రైతు సంఘాలు
-
Movies News
Sobhita Dhulipala: మోడలింగ్ వదిలేయడానికి అసలైన కారణమదే: శోభితా ధూళిపాళ్ల
-
Politics News
Balineni: పార్టీలోని కొందరు కావాలనే ఇబ్బంది పెట్టారు.. సీఎంతో భేటీ అనంతరం బాలినేని
-
Sports News
IPL 2023: ఒత్తిడిలోనూ అద్భుత ప్రదర్శన.. అతడికి మంచి భవిష్యత్తు : వసీమ్ అక్రమ్
-
India News
Doctors: ఏళ్లపాటు విధులకు డుమ్మా.. వీళ్లేం వైద్యులు బాబోయ్!