Amritpal Singh: టోల్‌ప్లాజా వద్ద కారులో అమృత్‌పాల్ సింగ్..!
పరారీలో ఉన్న ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్ (Amritpal Singh) ఆచూకీ ఇంకా తెలియరాలేదు. అయితే అతడికి సంబంధించిన కొన్ని దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.
చండీగఢ్: ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్ (Amritpal Singh)ను పట్టుకునేందుకు పంజాబ్(Punjab) పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలో అతడికి సంబంధించి మరో విషయం వెలుగులోకి వచ్చింది. శనివారం రోజున అతడు కారులో వెళ్తున్నప్పటి సీసీటీవీ ఫుటేజ్ ఒకటి చక్కర్లు కొడుతోంది. అందులో అతడు టోల్ ప్లాజా వద్ద కారు ముందు సీటులో కూర్చొని ఉన్నట్లు కనిపిస్తోంది.
అమృత్‌పాల్ (Amritpal Singh) కోసం శనివారం పోలీసులు పక్కా వ్యూహంతో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టినప్పటికీ అతడు తప్పించుకున్న విషయం తెలిసిందే. పోలీసులు వచ్చినట్లు సమాచారం అందగానే తాను ప్రయాణిస్తున్న మెర్సిడెస్ వాహనాన్ని అమృత్‌పాల్ అక్కడే వదిలేశాడు. తర్వాత బ్రెజా కారులోకి మారాడు. ఇప్పుడు జలంధర్‌లోని టోల్‌ప్లాజా వద్ద అతడు బ్రెజా కారులోని కనిపించాడు. బ్రెజాలోనే అతడు తన దుస్తులు కూడా మార్చుకున్నట్లు సమాచారం.
అమృత్‌పాల్ (Amritpal Singh) పారిపోయేందుకు సహకరించిన అతడి అనుచరుల్లో దాదాపు 120 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కన్నుగప్పి అతడు పారిపోవడంపై పంజాబ్- హరియాణా హైకోర్టు(Punjab- Haryana High Court) మంగళవారం పంజాబ్(Punjab) ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇది పోలీసుల నిఘా వైఫల్యమేనని పేర్కొంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Pattabhi: ఉద్యోగులకు మళ్లీ అన్యాయమే: పట్టాభి
-
India News
NIA: ఖలిస్థాన్ ‘టైగర్ ఫోర్స్’పై ఎన్ఐఏ దృష్టి.. 10 చోట్ల ఏకకాలంలో దాడులు
-
General News
TS Government: ₹లక్ష ప్రభుత్వ సాయం.. అప్లై చేసుకోండిలా..
-
World News
Imran Khan: ఇక పాక్ మీడియాలో ఇమ్రాన్ కనిపించరు.. వినిపించరు..!
-
India News
Odisha Train Tragedy: ఒడిశా రైలు దుర్ఘటన.. విద్యుత్ షాక్‌తోనే 40 మంది మృతి..!
-
Movies News
village backdrop movies: కథ ‘ఊరి’ చుట్టూ.. హిట్ కొట్టేట్టు!