Amul Milk: పాల ధర పెంపు

నిత్యావసర ధరలు ఆకాశాన్నంటడంతో ఇప్పటికే సతమతమవుతున్న సామాన్యుడికి మరో పిడుగులాంటి వార్త! దేశంలో ప్రముఖ పాల ఉత్పత్తి, మార్కెటింగ్‌ సంస్థ అమూల్‌ పాల ధరను......

Updated : 30 Jun 2021 18:29 IST

అహ్మదాబాద్‌: నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ సామాన్యుడికి మరో షాక్‌..! దేశంలో ప్రముఖ పాల ఉత్పత్తి, మార్కెటింగ్‌ సంస్థ అమూల్‌ పాల ధరను పెంచింది. లీటరు పాలపై రూ.2ల చొప్పున పెంచుతున్నట్టు వెల్లడించింది. అన్ని బ్రాండ్‌లకు ఈ పెంపును వర్తింపజేసింది. దేశ వ్యాప్తంగా జులై 1నుంచి కొత్త ధరలు అమలులోకి వస్తాయని గుజరాత్‌ కో-ఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ (జీసీఎంఎంఎఫ్‌) స్పష్టంచేసింది. 

ఉత్పత్తి వ్యయం పెరగడంతో దాదాపు 19 నెలల తర్వాత ధర పెంచినట్టు పేర్కొంది. అమూల్‌ గోల్డ్‌, తాజా, శక్తి, టి స్పెషల్‌ తదితర బ్రాండ్‌లన్నింటిపైనా పెంచిన ఈ ధరలు గురువారం నుంచి అమలు కానున్నాయని అమూల్‌ బ్రాండ్ ఉత్పత్తుల మార్కెటింగ్‌ సంస్థ (జీసీఎంఎంఎఫ్‌) ఎండీ ఆర్‌ఎస్‌ శోధి తెలిపారు. ప్యాకింగ్‌పై అదనపు వ్యయం 30 నుంచి 40శాతం, రవాణాపై 30శాతం, ఇంధన వ్యయం 30 శాతం పెరగడంతో పాల ధరలు పెంచినట్టు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని