Bipin Rawat: ‘వీర వణక్కం’ రావత్‌.. 50 కి.మీ. మేర బారులు తీరి ప్రజల నివాళి..!

చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ భౌతిక కాయానికి తమిళనాడులో భావోద్వేగ పూరితంగా వీడ్కోలు పలికారు. హెలికాఫ్టర్‌ ప్రమాదంలో మరణించిన వారి పార్థివదేహాలను 13 అంబులెన్స్‌లో

Updated : 10 Dec 2021 11:22 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ భౌతికకాయానికి తమిళనాడులో భావోద్వేగ పూరితంగా ప్రజలు వీడ్కోలు పలికారు. హెలికాఫ్టర్‌ ప్రమాదంలో మరణించిన వారి పార్థివదేహాలను 13 అంబులెన్స్‌లలో ఉంచి కూనూరు నుంచి సూలురు ఎయిర్‌ బేస్‌కు తరలించారు. ఈ మార్గంలో మెట్టుపాల్యం నుంచి సూలురు వరకు సుమారు 50 కిలోమీటర్ల మేర ప్రజలు బారులు తీరి భౌతికకాయాలు తరలిస్తోన్న అంబులెన్స్‌లపై పూలుచల్లి నివాళులర్పించారు. ‘భారత్‌మాతాకీ జై’, ‘వీర వణక్కం.. వీర వణక్కం’ (వీరుడుకి వందనాలు) అంటూ నినాదాలు చేశారు. ఇప్పుడు ఆ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

భావోద్వేగపూరిత పోస్టుతో సైన్యం ట్విటర్‌ హ్యాండిల్‌..

భారత సైన్యం ప్రజా సంబధాల కోసం నిర్వహించే ట్విటర్‌ హ్యాండిల్‌ ‘ఏడీజీ పీఐ- ఇండియన్‌ ఆర్మీ’ సీడీఎస్‌ దివంగత బిపిన్‌రావత్‌పై భావోద్వేగపూరిత ట్వీట్‌ చేసింది. ‘‘మన జాతీయ పతాకం గాలి కారణంగా రెపరెపలాడదు.. దేశాన్ని కాపాడేందుకు ప్రాణత్యాగాలు చేసే సైనికుల తుదిశ్వాసతో అది రెపరెపలాడుతుంది’’ అని పేర్కొని బిపిన్‌ రావత్‌ చిత్రాన్ని షేర్‌ చేసింది. రావత్‌కు దేశ ప్రజలు ఆన్‌లైన్‌లో నివాళి అర్పించేందుకు భారత సైన్యం ఒక ప్రత్యేకమైన లింక్‌ను ఈ ట్వీట్‌లో ఉంచింది.  

శత్రువు పాలిట ఖడ్గానివి అంటూ అమూల్‌ కార్టూన్‌..

సమకాలీన అంశాలపై కార్టూన్లను తయారు చేసి వాటిని సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తూ అమూల్‌ సంస్థ నెటిజన్లను ఆకర్షిస్తుంటుంది. ఈ సారి బిపిన్‌ రావత్‌పై ఆ సంస్థ కార్టూన్‌ వేసింది.  సైనిక ఖడ్గంతో నడుచుకుంటూ రావత్‌ వస్తున్నట్లు అది ఉంది. ‘‘ప్రతిసైనికుడికి ఆత్మీయుడు ఆయన.. శత్రువు పాలిట ఖడ్గం ఆయన’’ అని పేర్కొంది. ఈ ట్వీట్‌ను 3 వేల మందికి పైగా రీట్వీట్‌ చేశారు.




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని