Australia Murder: ఆస్ట్రేలియాలో హత్య చేసి.. భారత్‌లో చిక్కి..!

పంజాబ్‌కు చెందిన రాజ్‌విందర్‌ సింగ్(38) నర్సింగ్‌ అసిస్టెంట్‌. నాలుగేళ్ల క్రితం ఆస్ట్రేలియాలో ఒక యువతిని హత్యచేసిన కేసులో తాజాగా అరెస్టయ్యాడు. 

Updated : 25 Nov 2022 15:31 IST

దిల్లీ: ఆస్ట్రేలియాలో ఒక మహిళను హత్యచేసిన కేసులో మనదేశానికి చెందిన వ్యక్తిని శుక్రవారం దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి ప్రభుత్వం అభ్యర్థన మేరకు ఈ అరెస్టు చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..?

పంజాబ్‌కు చెందిన రాజ్‌విందర్‌ సింగ్(38) నర్సింగ్‌ అసిస్టెంట్‌. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో ఉద్యోగం చేస్తుండేవాడు. 2018లో తొయా కార్డింగ్లేను హత్య చేసిన కేసులో నిందితుడు. కార్డింగ్లే ఫార్మసీ ఉద్యోగిని. క్వీన్స్‌లాండ్‌ బీచ్‌కు వాకింగ్‌కు వచ్చిన ఆమెను రాజ్‌విందర్ హత్య చేశాడని ప్రధాన ఆరోపణ. దాని తర్వాత రెండు రోజులకు తన కుటుంబం, ఉద్యోగం అన్నింటిని వదిలేసి, భారత్‌కు పారిపోయివచ్చాడు. దాంతో అతడి ఆచూకీ తెలుసుకునేందుకు.. అక్కడి పోలీసులు భారీ రివార్డు ప్రకటించారు. ఈ క్రమంలో భారత్‌లో ఉన్న అతడిని రప్పించేందుకు గత ఏడాది మార్చిలో అక్కడి ప్రభుత్వం మన దేశానికి అభ్యర్థన చేసింది. ఈ నవంబర్‌లో ఆమోదం లభించగా.. శుక్రవారం అతడిని దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. కార్డింగ్లే 2018, అక్టోబర్ 21న కనిపించకుండాపోయింది. తర్వాత రోజు వాంగెట్టి బీచ్‌లో ఆమె మృతదేహం దొరికింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని