Viral Video: చద్దా ‘ఫస్ట్‌ లవ్‌’ గురించి వెంకయ్య నాయుడు ప్రశ్నించిన వేళ..!

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు(Venkaiah Naidu), ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దా(Raghav Chadha) మధ్య జరిగిన సంభాషణ నవ్వులు పూయిస్తోంది. ఏడాది కిందటి వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. 

Published : 17 May 2023 01:35 IST

దిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత రాఘవ్‌ చద్దా(Raghav Chadha) పేరు ఇటీవల తెగ వినిపిస్తోంది. బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా( Parineeti Chopra)తో ఉన్న అనుబంధమే అందుకు కారణం. మూడు రోజుల క్రితమే వారికి నిశ్చితార్థం జరిగింది. ఈ సమయంలో ఆయనకు సంబంధించిన ఒక పాత వీడియో వైరల్‌గా మారింది. అందులో మాజీ ఉపరాష్ట్రపతి, రాజ్యసభ మాజీ  ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు(Venkaiah Naidu), చద్దాకు మధ్య జరిగిన సంభాషణ నవ్వులు పూయిస్తోంది. 

ఆ వీడియో వెంకయ్యనాయుడి(Venkaiah Naidu)కి వీడ్కోలు పలుకుతున్ననాటిది. అందులో చద్దా.. వెంకయ్యను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు.  
చద్దా: నేను మీ సమక్షంలోనే  రాజ్యసభ( Rajya Sabha) సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశాను. సమయపాలన నేర్చుకున్నా. ఒక రాజ్యసభ సభ్యుడిగా మీరు నా మొదటి ఛైర్మన్‌. మీరు ఎప్పటికీ నాకలా గుర్తుండిపోతారు... అని ఫస్ట్‌ టీచర్‌, ఫస్ట్‌ స్కూల్‌, ఫస్ట్‌ లవ్‌ అంటూ పోలిక తెచ్చారు. ఆయన ఫస్ట్‌ లవ్ పదాన్ని పట్టుకున్న వెంకయ్యనాయుడు.. రాఘవ్‌చద్దాను ఆటపట్టించారు.

వెంకయ్యనాయుడు: రాఘవ్‌ .. మీరు ఒక్కసారే ప్రేమలో పడతారని నేను నమ్ముతున్నా. ఫస్ట్‌ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం.. ఇలా జరగదనుకుంటున్నా. మీరు ఒక్కసారే ప్రేమిస్తారు కదా..? అని అనగానే సభ నిండా నవ్వులు విరబూశాయి.

చద్దా: సర్.. నాకు దాని గురించి అంత అనుభవం లేదు. కానీ బాగుంటుంది

వెంకయ్యనాయుడు: ఫస్ట్‌ లవ్‌ మంచిదే. అది ఎప్పటికీ నిలిచి ఉండాలి..అని సలహా ఇచ్చారు. ఈ వీడియోను రాఘవచద్దా(Raghav Chadha) గతంలో ట్విటర్‌లో షేర్ చేశారు.

ఇక ప్రస్తుత విషయానికొస్తే.. రాఘవ్‌-పరిణీతికి కాలేజ్‌ రోజుల నుంచే పరిచయం ఉందట. అయితే వీళ్లిద్దరి మధ్య ప్రేమ పుట్టింది మాత్రం గతేడాది ‘చమ్కీలా’ సినిమా షూటింగ్‌లోనేనట! ఈ చిత్ర షూటింగ్‌ కోసం పంజాబ్‌ వెళ్లిన పరిణీతి( Parineeti Chadha)ని.. రాఘవ్‌ అక్కడే కలుసుకోవడం, ఆపై ప్రేమించుకోవడం.. చకచకా జరిగిపోయాయట! అయితే ఇన్నాళ్లూ ఈ విషయాన్ని దాస్తూ వచ్చిన ఈ జంట.. నిశ్చితార్థంతో తమ ప్రేమను బయటపెట్టింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని