Anand Mahindra: గతం వదిలేయ్‌.. భవిష్యత్తుపై హైరానావద్దు.. మహీంద్రా పోస్టు చూడాల్సిందే..!

సోమవారం ఒక మోటివేషనల్ పోస్టు పెట్టారు మహీంద్రా(Anand Mahindra). అది ప్రజల ప్రస్తుత జీవనశైలిని ప్రతిబింబిస్తోంది. 

Published : 20 Mar 2023 19:11 IST

ముంబయి: ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా(Anand Mahindra) ట్విటర్‌లో ఎంత చురుగ్గా ఉంటారో తెలిసిందే. అలాగే ఆయన పెట్టే పోస్టుల్లో ఏదో ఒక చమక్కు ఉండనే ఉంటుంది. తాజాగా సోమవారం ఉదయం ఓ మోటివేషనల్‌ పోస్టు(Motivational post) పెట్టారు. ఒక మనిషి ఆలోచనా విధానాన్ని బట్టి అతడు గతంలోనే ఉండిపోయాడా..? వర్తమానంలో జీవిస్తున్నాడా..? భవిష్యత్తు గురించి హైరానా పడుతున్నాడా..? అని వివరించిన ఒక వెన్‌ డయాగ్రామ్‌ను షేర్ చేశారు.  ‘ఈ ఛార్ట్‌ వైపు నేను చూస్తూనే ఉన్నాను. ఇందులో ఎంతో తత్వం ఉంది. కొత్తగా ఒకవారాన్ని ప్రారంభించేందు ముందు ఇది ఎంతగానో ఉపకరిస్తుంది. గతవారం చేసిన తప్పుల గురించి బాధపడొద్దు. భవిష్యత్తు గురించి వణికిపోవద్దు. వర్తమానంలో ఉంటూ ప్రస్తుత పనిపై దృష్టిపెట్టండి’ అంటూ ఆ ఆ ఛార్ట్‌ను షేర్ చేశారు. అవును సర్ ఇది నిజం అంటూ పలువురు నెటిజన్లు బదులిస్తున్నారు. అయితే మనమూ ఒకసారి ఆ ఛార్ట్‌ను గమనిద్దామా..!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు