Anand Mahindra: ఆ కాఫీ మగ్‌ తెప్పించుకోబోతున్నాను..!

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా నెట్టింట్లో పోస్టు పెట్టారంటే.. అది కచ్చితంగా వర్తమాన అంశమో, స్ఫూర్తి నింపే వాక్యమో, ఆలోచించే విషయమో అయ్యుంటుంది.

Published : 11 Aug 2022 01:39 IST

ముంబయి: ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా నెట్టింట్లో పోస్టు పెట్టారంటే.. అది కచ్చితంగా వర్తమాన అంశమో, స్ఫూర్తి నింపే వాక్యమో, ఆలోచించే విషయమో అయ్యుంటుంది. తాజాగా షేర్ చేసిన సందేశం కూడా ఆ కోవలోనిదే. ఆలోచనలకు పరిమితులు గీయొద్దనే సూచన అందులో కనిపిస్తోంది.

ఆయన షేర్ చేసిన ఫొటోలో.. ఒక కాఫీ మగ్‌పై tic-tac-toe అనే ఆటకు సంబంధించిన చిత్రం ఉంది. అందులోని క్రాస్‌(X)లను కేటాయించిన బాక్స్ దాటి కలపడం కనిపిస్తోంది. ‘పరిధిదాటి ఆలోచించండి’ అనే సూక్తి ఆపైన రాసుంది. ఇది మహీంద్రాను మెప్పించింది. ‘నేను ఈ మగ్‌ను తెప్పించుకోబోతున్నాను. తెలివిగా చెప్పారు. ప్రతిసారి మీ పరిధి దాటి ఆలోచించడం ద్వారా మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది’ అని దానిని ఉద్దేశించి రాసుకొచ్చారు. ఈ ట్వీట్ నెటిజన్లను ఎంతగానో నచ్చింది. గొప్ప ఆలోచన అంటూ కామెంట్లతో స్పందించారు.  

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts