Rishi Sunak: ఆయన సూపర్‌ స్మార్ట్.. పొందికగా మాట్లాడగల నేర్పరి..!

కొద్దికాలంగా ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోన్న బ్రిటన్‌కు కొత్త ప్రధానిగా రిషి సునాక్‌ నియమితులయ్యారు. ఆయన సామర్థ్యాలపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా విశ్వాసం వ్యక్తం చేశారు. 

Updated : 26 Oct 2022 16:20 IST

దిల్లీ: భారత మూలాలున్న బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ను ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా ప్రశంసించారు. ఆయన చాలా స్మార్ట్‌ అని, ప్రతిమాటా ఆచితూచి మాట్లాడతారని కొనియాడారు. 

‘ఆయన ముందు భయానకరీతిలో సవాళ్లు కుప్పగా పేర్చిఉన్నాయి. వాటిని ఎదుర్కొనే క్రమంలో ఆయన విజయం సాధించొచ్చు, విఫలం కావొచ్చు. అది ఆయనలో సత్తా లేకపోవడం వల్ల కాదు. ఆయన చురుకైన వ్యక్తి. సునిశిత దృష్టి కలవారు. ఆచితూచి ఎంతో పొందికగా మాట్లాడగల నేర్పరి’ అని ట్విటర్‌లో రాసుకొచ్చారు. బ్రిటన్‌ ప్రధానిగా నియమితులైన తర్వాత సునాక్‌ మీడియాతో మాట్లాడిన వీడియోను మహీంద్రా షేర్ చేశారు. 

కొద్దికాలంగా బ్రిటన్ ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కించడమే రిషి ముందున్న అతిపెద్ద సవాల్‌. బ్రిటన్‌ ద్రవ్యోల్బణం 10శాతం మించిపోతోంది. జీ7 దేశాల్లో ఇదే అత్యధికం. ఇంధన టారిఫ్‌లు, ఆహార ధరలు భారీగా పెరిగాయి. సంపాదన తగ్గుతూ.. జీవన వ్యయం పెరుగుతోందని పౌరులు ఆందోళన చెందుతున్నారు. ఇలా మాంద్యం భయాలు నెలకొన్న బ్రిటన్‌లో.. మార్కెట్లను శాంతపరచి, దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించి అక్కడి ప్రజల్లో ఆయన విశ్వాసాన్ని నింపగలరో లేదో చూడాలి..!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని