Anand Mahindra: ఆ ‘కారు’ గేట్‌.. మహీంద్రా మదిలో డౌట్‌.. ఏంటా కథ?

సోషల్‌మీడియాలో తరచూ సృజనాత్మక, స్ఫూర్తినింపే కథనాలు, వీడియోలను పోస్ట్‌ చేసే ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్రా తాజాగా

Published : 19 Aug 2022 19:08 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సోషల్‌మీడియాలో తరచూ సృజనాత్మక, స్ఫూర్తినింపే కథనాలు, వీడియోలను పోస్ట్‌ చేసే ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్రా తాజాగా మరో ఆసక్తికర వీడియోను షేర్‌ చేశారు. ఓ వ్యక్తి తన ఇంటి ముందు ఏర్పాటు చేసుకున్న విచిత్రమైన గేటుకు సంబంధించిన వీడియో అది. అది చూడగానే మహీంద్రా మదిలో ఆశ్చర్యంతో పాటు అనేక ప్రశ్నలు తలెత్తాయట. ఇంతకీ ఏంటా గేటు..? మహీంద్రాకు వచ్చిన డౌటేంటీ..?

ఆనంద్‌ మహీంద్రా శుక్రవారం తన ట్విటర్‌ ఖాతాలో ఓ వీడియో పోస్ట్‌ చేశారు. అందులో ఓ వ్యక్తి తన ఇంటి గేటు తీసుకుని బయటకు వస్తున్నారు. అయితే అది సాదాసీదా గేటు కాదండోయ్‌.. అచ్చంగా కారు ఆకారంలో ఉంది. ఆ వ్యక్తి కారు డోరును ఎలా తీస్తారో అలా తీసుకుని బయటకు వచ్చారు. ఈ వీడియోను చూడగానే మహీంద్రాకు అనేక సందేహాలు వచ్చాయట. ‘‘ఈయన ఎలాంటి వ్యక్తి: 1. కార్లను అమితంగా ప్రేమించే వ్యక్తి? 2. తన ఇంట్లోకి ఎవరూ రాకుండా ఉండాలనుకునే బిడియస్తుడా? 3. మంచి హాస్యచతురత ఉన్న సృజనాపరుడా? 4. పైవన్నీనా?’’ అని మహీంద్రా రాసుకొచ్చారు.

ఇంకేముంది.. ఈ వీడియో కాస్తా ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వ్యక్తి సృజనకు కొందరు నెటిజన్లు మెచ్చుకుంటుండగా.. మరికొందరు ఆయనకు కార్లంటే ఎంత ప్రేమో అని కామెంట్లు పెడుతున్నారు.


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని