Anand Mahindra: తోలుబొమ్మ ‘నాటు నాటు’.. ఆనంద్ మహీంద్రా పోస్ట్ వైరల్
‘ఆస్కార్’ గెలిచిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) లోని ‘నాటు నాటు’ పాటకు ఓ మహిళ తోలుబొమ్మతో డ్యాన్స్ చేయించారు. సంబంధిత వీడియోను ఆనంద్ మహీంద్రా పంచుకోవడంతో అది వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ర మహీంద్రా (Anand Mahindra) ఏం పంచుకున్నా అది వైరల్ అవుతూనే ఉంటుంది. అలాంటి కంటెంట్‌ను షేర్ చేస్తుంటారాయన. ‘ఆస్కార్’ (Oscar 2023) పొందిన ‘నాటు నాటు’ (Naatu Naatu) పాట ప్రదర్శనకు సంబంధించి ఇప్పుడాయన చేసిన పోస్ట్ నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అందులో.. ఓ మహిళ తోలుబొమ్మతో ‘నాటు నాటు’ డ్యాన్స్ చేయించే దృశ్యాలు ఆసక్తిగా సాగాయి. బీట్‌కు తగ్గట్టు ఆ బొమ్మ చేయి, కాలు కదిలించడాన్ని చూస్తే ‘వావ్’ అనాల్సిందే. ఆ మహిళ ప్రతిభకు నెటిజన్లంతా ఫిదా అవుతున్నారు. ఆ ప్రదర్శన ఎక్కడిదో, ఆమె ఎవరో వెల్లడించని ఆనంద్ మహీంద్రా.. ‘‘ఈ వీడియో పోస్ట్ చేయకుండా ఉండలేకపోయా. ప్రపంచవ్యాప్తం అనడానికి ఇది నిదర్శనం’’ అని పేర్కొన్నారు. ఇంకెందుకు ఆలస్యం ఈ సరికొత్త ‘నాటు నాటు’ను మీరూ చేసేయండి..
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Sumalatha: సీనియర్ నటి సుమలత కుమారుడి పెళ్లి.. సినీ, రాజకీయ ప్రముఖుల సందడి
-
General News
CM KCR: భారాస మానవ వనరుల కేంద్రానికి సీఎం కేసీఆర్ భూమిపూజ
-
India News
Bridge Collapse: రూ.1700 కోట్ల వంతెన కూల్చివేత.. గార్డు గల్లంతు..
-
Sports News
WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి..?
-
India News
NIRF Rankings: దేశంలోనే ఉత్తమ విద్యాసంస్థగా ‘ఐఐటీ మద్రాస్’.. వరుసగా అయిదో ఏడాది
-
Politics News
Peddireddy: ముందస్తు ఎన్నికలు.. మంత్రి పెద్దిరెడ్డి క్లారిటీ