Published : 16 Aug 2022 01:17 IST

Anand Mahindra: జెండా ఎగురవేసేందుకు వృద్ధ జంట ప్రయాస.. ఆనంద్‌ మహీంద్రా ఎమోషనల్‌ పోస్ట్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: డెబ్భై ఐదేళ్ల స్వాతంత్ర్య ఉత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపునకు విశేష స్పందన లభించింది. ‘హర్‌ ఘర్‌ తిరంగా’ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా ఊరూ వాడా అంతా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. ఈ సందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా షేర్‌ చేసిన ఓ ఫొటో.. ‘హర్‌ ఘర్‌ తిరంగా’ విజయవంతమైందని చెప్పేందుకు నిలువెత్తు నిదర్శంగా నిలిచింది.

అమృతోత్సవాల్లో భాగంగా ఓ పేద వృద్ధ దంపతులు తమ రేకుల ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసేందుకు ఎంతో కష్టపడ్డారు. వృద్ధ మహిళ ఓ ఇనుప డ్రమ్‌పై నిల్చుని జెండాను కడుతున్నారు. ఆమె ఎక్కడ కిందపడుతుందోనేని ఆమె భర్త డ్రమ్‌ను గట్టిగా పట్టుకుని నిల్చున్నారు. ఈ ఫొటోను ఆనంద్‌ మహీంద్రా ట్విటర్‌లో షేర్‌ చేస్తూ.. ‘‘స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఇంత హడావుడి ఎందుకు చేస్తారని మీకు ఎప్పుడైనా అనిపిస్తే ఈ ఇద్దరిని అడగండి. గొప్ప గొప్ప వక్తలు చెప్పే ఉపన్యాసాల కంటే అద్భుతంగా వారు మీకు వివరిస్తారు. జై హింద్‌’’ అని రాసుకొచ్చారు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవడమే గాక, ఎంతోమంది హృదయాలను హత్తుకుంది. ఈ వృద్ధ జంట దేశభక్తికి నెటిజన్లు సెల్యూట్‌ చేస్తున్నారు.

త్రివర్ణ పతాకానికి హారతి..

జాతీయ జెండాను చూడగానే ప్రతి భారతీయుడి మనసు దేశభక్తితో, గర్వంతో ఉప్పొంగిపోతుంది. అందుకేనేమో ఆ త్రివర్ణ పతాకంపై తన గౌరవాన్ని ప్రత్యేకంగా చాటుకుందీ మహిళ.  తన ఇంటిముందు ఎగువేసిన మువ్వన్నెల జెండాకు హారతిచ్చి కొలిచింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఐఏఎస్‌ అధికారి అవనీశ్‌ శరణ్‌ తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు గానీ.. ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు దాదాపు 2.5లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు.

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు ప్రతి ఇంటిపై జెండా ఎగరవేయాలంటూ కేంద్ర ప్రభుత్వం ‘హర్‌ ఘర్‌ తిరంగా’ ప్రచారం చేపట్టింది. ఈ కార్యక్రమంలో యావత్‌ భారతావని ఉత్సాహంగా పాల్గొంది. దేశవ్యాప్తంగా 20 కోట్ల కుటుంబాల నివాసాలపై మువ్వన్నెల జెండా రెపరెపలాడింది.


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని