Anand Mahindra: ఆనంద్‌ మహీంద్రాను ఆకట్టుకున్న పరీక్ష అది..మీరూ ప్రయత్నిస్తారా?

మహీంద్రాగూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా చేసిన ట్వీట్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది. హార్వర్‌ విశ్వవిద్యాలయం రూపొందించిన ఓ టెస్టును ఆయన ట్వీట్‌ చేశారు. మీరూ ఓ సారి ఆ పరీక్షను ప్రయత్నించి చూడండి

Published : 03 Oct 2022 01:26 IST

ముంబయి: ప్రముఖ వ్యాపార వేత్త, మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా నెట్టింట్లో ఏదైనా షేర్‌  చేశారంటే..కచ్చితంగా ఆది ఆసక్తికరంగానో, ఆలోచింపచేసేదిగానో ఉంటుంది. తాజాగా శనివారం ఆయన ఓ పోస్టును ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఒక వ్యక్తి మానసిక వయస్సును నిర్ణయించే పరీక్ష అది. ‘‘నా స్నేహితుడి కోరిక మేరకు ఈ పరీక్షను ప్రయత్నించి చూశాను. అద్భుతంగా ఉంది. వివాదాస్పదమైన ఫలితమేమీ ఇవ్వలేదు’’ అంటూ ఆనంద్‌ మహీంద్రా రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆ ట్వీట్‌ ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది.

ఇంతకీ అందులో ఏముందంటే.. చిన్న చిన్న తేడాలతో దాదాపు ఒకే విధంగా ఉన్న 12 వాక్యాలను ఇచ్చారు. వాటన్నింటినీ ఒక్క తప్పు కూడా లేకుండా బయటకు చదవాలి. 50 ఏళ్ల వయస్సు పైబడిన వారు కచ్చితంగా ఈ పరీక్షలో పాసవ్వడం కష్టమట. అంతేకాకుండా ప్రతి వాక్యంలోని మూడో పదాన్ని పై నుంచి కిందికి చదవమన్నారు. ఇది మాత్రం చాలా సులువుగా చదివేయొచ్చు. ఈ పరీక్షను హార్వర్డ్‌ యూనివర్సీటీ రూపొందించింది. ఆనంద్‌ మహీంద్రాను ఈ పరీక్ష ఎంతగానో ఆకట్టుకుందట. కావాలంటే మీరూ ఒక సారి ప్రయత్నించి చూడండి మరి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని