Idepenndence Day: స్వాతంత్య్రానికి సరికొత్త అర్థం ఇది.. ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌

సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా అండ్‌ మహీంద్రా సంస్థ అధినేత ఆనంద్‌ మహీంద్రా.. స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని ఆదివారం ట్విటర్‌ వేదికగా బలమైన సందేశాన్ని చాటారు. ‘స్వాతంత్ర్యం అంటే ఒకరి మీద లేదా ఒకదానిపైన ఆధారపడకుండా ఉండటం,.

Updated : 15 Aug 2021 22:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా అండ్‌ మహీంద్రా సంస్థ అధినేత ఆనంద్‌ మహీంద్రా.. స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని ఆదివారం ట్విటర్‌ వేదికగా బలమైన సందేశాన్ని చాటారు. ‘స్వాతంత్ర్యం అంటే ఇతరుల మీద ఆధారపడకుండా ఉండటం. కానీ.. కరోనా మహమ్మారి మనకు సరికొత్త అర్థాన్ని నేర్పింది. అందరి అభ్యున్నతి కాంక్షిస్తూ ఒక బృందంగా పనిచేయడం ద్వారా నిజమైన స్వేచ్ఛ వస్తుందని చాటింది. ఈ రోజును మనం ‘పరస్పర ఆధార దినోత్సవం(ఇంటర్‌డిపెండెన్స్‌ డే)గానూ జరుపుకోవచ్చు. జై హో!’ అని ట్వీట్‌ చేశారు. నెటిజన్లు సైతం ఆయన వ్యాఖ్యలకు మద్దతు పలుకుతూ కామెంట్లు చేశారు. పంద్రాగస్టు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు దేశవ్యాప్తంగానూ స్వాతంత్ర్యదినోత్సవ  సంబరాలు మిన్నంటాయి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని